Advertisement
Google Ads BL

షాలినిపాండేకి 'ప్రీతి' పాత్ర అలా వచ్చింది!


అర్జున్‌రెడ్డి చిత్రంలో ప్రీతిగా అదరగొట్టిన హీరోయిన్‌ షాలినిపాండే. ఈమె తాజాగా 'మహానటి'లో కూడా నటించింది. తమిళంలో తెలుగుకి రీమేక్‌గా రూపొందుతున్న '100% లవ్‌' రీమేక్‌ '100% కాదల్‌'లో ఈమె సంగీత దర్శకుడు, హీరో జి.వి ప్రకాష్‌కుమార్‌ సరసన తెలుగులో తమన్నా చేసిన మహాలక్ష్మి పాత్రను పోషిస్తోంది. దీనితో పాటు మరో రెండు తమిళ చిత్రాలలో నటిస్తున్న ఈమె ప్రస్తుతం నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తున్న గుహన్‌ చిత్రంలో కూడా యాక్ట్‌ చేస్తోంది. ఈమె తన కెరీర్‌ గురించి చెబుతూ, చిన్ననాటి నుంచి నాకు నటిని కావాలనే పిచ్చి ఉంది. నటన అయితే పలు కొత్త వ్యక్తులతో పలు పాత్రలలో నటించవచ్చని నా ఉద్దేశ్యం, నాకు వయసు వచ్చిన తర్వాత చూసిన మొదటి చిత్రం 'చాచీ 420' ఇదే తెలుగులో 'భామనే సత్యభామనే'. దాంతో నేను కమల్‌హాసన్‌కి పెద్ద ఫ్యాన్‌ అయ్యాను, వయసు పెరిగే కొద్ది శ్రీదేవి, మాధురీ దీక్షత్‌లంటే కూడా ఎంతో ఇష్టం ఏర్పడింది. 

Advertisement
CJ Advs

టీవీలలో ప్రసారం అయ్యే ప్రతి చిత్రం చూసే దానిని. చిన్నప్పుడు పెద్ద స్క్రీన్‌పై సినిమా చూడటం ఎంతో అద్భుతమైన థ్రిల్‌గా అనిపించేది. ఏనాటికైనా నేను కూడా అదే తరహాలో వెండితెరపై కనిపించాలని కలలు కనేదానిని. కోర్సు పూర్తయిన తర్వాత ఫ్రెండ్స్‌తో కలసి బాలీవుడ్‌లో ఆడిషన్స్‌ గురించి మాట్లాడుకుంటున్నాం. అంతే ఓ ముంబైవ్యక్తి నా ఫొటోలు తీసుకుని కొందరు దక్షిణాది వారికి పంపాడు. అలా సందీప్‌రెడ్డి వంగా నుంచి 'అర్జున్‌రెడ్డి' కోసం ఫోన్‌ వచ్చింది. 300మందిని ఆడిషన్స్‌ టెస్ట్‌ చేసి నేనైతే ఆ పాత్రకు బాగుంటుందని అనుకున్నారట. ఆయన కథ చెప్పడం. మూడు రోజుల్లో నేను అగ్రిమెంట్‌పై సంతకం చేయడం అయిపోయాయి. 

ఇక నేను సినిమాల అవకాశాల కోసం ప్రయత్నించే సమయంలో ఇద్దరు అబ్బాయిలతో కలసి రూమ్‌ని షేర్‌ చేసుకునే దానిని. నా స్నేహితులందరు అబ్బాయిలే. అమ్మాయిలతో ఉన్నట్లే అబ్బాయిలతో ఉంటే తప్పేమిటి? నాకైతే నా స్నేహితులతో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ దానిని విన్నవారు మాత్రం ఎందుకు రచ్చచేసి వివాదం చేస్తారో అర్ధంకాని విషయం అని చెప్పుకొచ్చింది ప్రీతి అలియాస్‌ షాలినిపాండే.

Shalini Pandey about Arjun Reddy Chance:

How Shalini Pandey Got Chance As A Heroine
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs