సావిత్రి గురించి నేటి తరానికి తెలియని పలు విషయాలు కొంచెం కొంచెంగా నేటి తరం వారికి కూడా అర్ధమయ్యాయి. నిర్మాతగా సినిమాలు తీసి, మద్యానికి బానిసై, జెమినిగణేషన్‌పై ఉన్న గుడ్డి ప్రేమ, జెమినితో విభేదాలు, జెమిని వద్దనుకున్న సావిత్రి ఆయనను మర్చిపోలేకపోవడం, పతాకస్థాయి నుంచి అధోపాతాళానికి ఆమె జీవితం పడిపోయింది. ఇక ఈ 'మహానటి' చిత్రంలో మధురవాణి పాత్రను చేసింది అక్కినేని ఇంటి కోడలు సమంత. సమంత విషయానికి వస్తే ఆమె ఏది చెప్పిన జంకు, బొంకు లేకుండా సూటిగా చెబుతుంది. ఏ విషయంపైనైనా ఎంత వివాదస్పద అంశమైనా ఆమె ఇతరులకు చెప్పేందుకు సంకోచించదు.
ఇక ఈమె తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు 'మహానటి'లోని సావిత్రి పాత్రకు చాలా పోలికలు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చింది. ప్రేమ విషయంలో సావిత్రిలానే నేను కూడా ఒకరిని నమ్మాను. అయితే అదృష్టం కొద్దీ తప్పించుకున్నాను. లేకపోతే నా జీవితం కూడా సావిత్రిలాగా తయారయ్యేది. ఆ బాధ నుంచి త్వరగా బయటపడ్డాను. నేను చేసుకున్న పుణ్యం కొద్దీ నాకు చైతు దొరికాడు. ఇంతకీ సమంత జీవితంలోకి వచ్చిన ఆ జెమినిగణేషన్ వంటి నటుడు ఎవరో..ఆ 'జబర్దస్త్' యువకుడు ఎవరో అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా సమంత మాట్లాడుతూ, నాకు పెళ్లయినా సినిమాలలో రొమాంటిక్ సీన్లకు నేను సిద్దమే. రొమాన్స్ కూడా వృత్తిలో భాగం. తెరపై రొమాన్స్ కూడా నటనలో భాగమే. సినిమాలతో మూడు తరాల అనుబంధం ఉన్న అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు నా నటనను సీరియస్‌గా తీసుకుంటాయని భావించడం లేదు. అయినా నేను చేసే పాత్రలు హుందాగా ఉండే విధంగా చూసుకుంటాను.
ఇకపై నేను నటించే ప్రతి చిత్రంలోనూ నా పాత్రకి నేనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటాను. నా జీవితం ఇంత ఆనందంగా ఉండటానికి కారణం అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు చూపే ప్రేమే అంటూ ఓ మీడియా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మొత్తానికి సమంత అందగత్తె, అల్లరిపిల్లేకాదు.. ఎంతో ధైర్యసాహసాలు ఉన్న యువతి అని కూడా ఒప్పుకోవాలి.