Advertisement
Google Ads BL

శ్వేతాబసు.. పెళ్లికూతురవుతోంది..!


'కొత్తబంగారులోకం' చిత్రంలో కాలేజీ అమ్మాయిగా తనదైన ముగ్దమోహన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా చోటు సంపాదించుకున్న నటి శ్వేతాబసు ప్రసాద్‌. ఈమె బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చిన్నవయసులోనే జాతీయ అవార్డును సాధించిన మంచి టాలెంట్‌ ఉన్న నటిగా పేరు తెచ్చుకుంది. కాకపోతే కాస్త పొట్టిగా ఉండటం ఈమె కెరీర్‌కి ఆటంకం అయింది. ఆ తర్వాత కొన్ని చిత్రాలలో నటించినా పెద్దగా అవకాశాలు రాలేదు. ఇలాంటి ఈమె జీవితంలో వ్యభిచారం అనే మచ్చకూడా పడింది. నాడు ఈమెని చూసి జాలిపడిన మన టాలీవుడ్‌ హీరోలు, ముఖ్యంగా మంచు విష్ణు అయితే ఇక నా నుంచి ఆమెకి వరుసగా అవకాశాలు ఇస్తానని ప్రామిస్‌ చేశాడు. 

Advertisement
CJ Advs

కానీ ఈ మాటలన్నీ నీటి మీద రాతలేనని తేలిపోయింది. చివరకు ఆమెకి ఏక్తాకపూర్‌ అండగా నిలిచింది. ఇక ప్రస్తుతం ఈమె తెలుగులో 'గ్యాంగ్‌స్టర్స్‌' అనే వెబ్‌సిరిస్‌లో కీలకపాత్రను పోషిస్తోంది. ఈమె త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుందని సమాచారం. బాలీవుడ్‌ దర్శకుడు రోహిత్‌ మిట్టల్‌ని ఆమె వివాహం చేసుకోనుంది. రోహిత్‌కి తానే గోవాలో తన లవ్‌ని ప్రపోజ్‌ చేశానని, దానికి ఆయన పూణెలో గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడని శ్వేతాబసుప్రసాద్‌ చెప్పుకొచ్చింది. ఇంట్లో వారు కూడా తమ ప్రేమను అంగీకరించారని, కొద్దిరోజుల కిందటే నిశ్చితార్ధం కూడా జరిగింది. కానీ ఈమె మీడియాను చూసి భయపడుతూ ఈ విషయాన్ని దాస్తోంది. 

కాగా శ్వేత, రోహిత్‌ మిట్టల్‌ల పెళ్లికి సహకరించింది ప్రముఖ బాలీవుడ్‌ ప్రముఖుడు అనురాగ్‌కశ్యప్‌. ఆయనే ఈ ఇద్దరిని ఒకటి చేయనున్నాడు. అయితే తమ వ్యక్తిగత జీవితాల గురించి తామే చెప్పుకోవడం తమకు ఇష్టం లేదని, పెళ్లి, ప్రేమ ప్రపోజల్స్‌ అబ్బాయిలే చేసే కాలం మారిందని, ఇప్పుడు అమ్మాయిలు కూడా ఈ ప్రపోజల్స్‌ చేస్తుండటం నిజమైన మార్పుగా ఆమె చెప్పుకొచ్చింది. మరి ఆమె వివాహం నిండు నూరేళ్లు హాయిగా సాగాలని ఆశిద్దాం. 

Shweta Basu Prasad Gets Engaged to Long Time Boyfriend:

Actress Swetha Basu Prasad Getting Marriage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs