Advertisement
Google Ads BL

చిరు, కొరటాల మూవీ ఈ అప్‌డేట్ విన్నారా?


చాలాకాలం గ్యాప్ తీసుకుని 2016 లో ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ కు రీఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాకు మంచి టాక్ వచ్చి భారీ కలెక్షన్స్ రావడంతో చిరు తర్వాత చేసే చిత్రంపై అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. యంగ్ డైరెక్టర్ సురేంద్ర రెడ్డి డైరెక్షన్ లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న 'సైరా' చిత్రం చేస్తున్నాడు.

Advertisement
CJ Advs

మరోపక్క ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉండగా చిరు తన తర్వాత సినిమా కూడా ఫిక్స్ చేసుకున్నట్టు సమాచారం. కొరటాల డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. 'భరత్ అనే నేను' సూపర్ హిట్ చిత్రం తర్వాత కొరటాల చిరుతో చేస్తున్న చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు.

సినిమాపై అంచనాలు పెరగడంతో ఈ సినిమాకు సంబంధించి కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. అందులో భాగంగా ఈ సినిమాలో చిరు డ్యూయల్ రోల్ చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. చిరు పోషిస్తున్న రెండు పాత్రల్లో ఒకటి చిన్న గ్రామంలో పొలం పనులు చేసుకునే పాత్ర కాగా రెండవది ఎన్ ఆర్ ఐ మిలియనీర్ పాత్ర. ఈ వార్త నిజమైతే చిరు ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. ఖైదీ  నెం.150 తర్వాత మళ్లీ వెంటనే చిరు ఇలా డ్యూయల్ రోల్ చేయాలని నిర్ణయించుకోవడంతో అందరిలోనూ ఆసక్తి నెలకుంది. అయితే ఈ సినిమాపై అధికార ప్రకటన రావాల్సిఉంది.

Chiranjeevi Playing Dual Role in Koratala Siva Film:

Megastar chiranjeevi to be seen in a Dual Role
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs