Advertisement
Google Ads BL

రంగమ్మత్త ఊపు మామూలుగా లేదు!


సామాన్యులు జన్మదినం అన్నా, మ్యారేజ్‌ డే అన్నా కనీసం ఏదైనా సినిమాకి వెళ్లడమే ఆర్ధికంగా తలకు మించిన భారం అవుతుంది. అదే డబ్బున్నవాళ్లు మాత్రం వెకేషన్‌, ఇతర సందర్భాలలో తమ దర్పం, హంగు ఆర్బాటం చూపిస్తారు. ఓ ప్రత్యేకరోజు వచ్చిన ఫ్యామిలీతో కలిసి విదేశాలలో వాలిపోతూ ఉంటారు. మహేష్‌ నుంచి నాని వరకు ఇదే వరస. ఇక మనం పెద్దగా పట్టించుకోం గానీ నేడు చిన్న సపోర్టింగ్‌ రోల్స్‌, టీవీలలో యాంకర్లుగా చేసే వారి సంపాదన కూడా మనం ఊహించని స్థాయిలో ఉంటోంది. దీనికి సుమ, అనసూయ, రేష్మితో పాటు జబర్ధస్త్‌ పార్టిసిపెంట్ల సంపాదన తెలిస్తే ఎవరైనా అమ్మా.. ఇంత సంపాదనా అంటూ కళ్లు బైర్లు కమ్ముతాయి. వారి ఇళ్లు కూడా ప్యాలెస్‌లని మించిపోతూ ఉంటాయి. 

Advertisement
CJ Advs

ఈ లిస్ట్‌లోకి యాంకరుగా, ప్రస్తుతం నటిగా కూడా పేరు తెచ్చుకుంటున్న అనసూయ కూడా చేరుతుంది. ఆమె భర్త సంపాదన ఎంతో తెలియదు గానీ ఆమె సంపాదన మాత్రం నెలకు లకారాలలోనే ఉంటుంది. అలాంటి ఆమె పెళ్లిరోజు వస్తే సింపుల్‌గా ఉంటుందా? చెప్పండి. అందుకే తన పెళ్లి రోజున ఈమె మాల్దీవుల్లో ప్రత్యక్షమైంది. అయితే ఈ సర్‌ప్రైజ్‌ని తన భర్త భరద్వాజ్‌ ఇచ్చాడని చెప్పుకొచ్చింది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది వెడ్డింగ్‌ యానివర్శరీని కూడా భరద్వాజ్‌ బాగా ప్లాన్‌ చేశాడు. మాల్దీవుల్లో నా భర్తతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నాను. ఈ ఏడాది మాల్దీవులకి వచ్చాం. ఇంతకన్నా ఎక్కువ ప్రేమను పొందగలమా? అని ట్వీట్‌ చేసింది. ఈ సందర్భంగా తన భర్తతో కలిసి మాల్దీవుల్లోని బీచ్‌లో సేరదీరుతున్న ఫొటోని పోస్ట్‌ చేసింది. 

ఇక అనసూయ భరద్వాజ్‌కి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మరి వారు కూడా మాల్దీవుల పర్యటనకు వెళ్లారో? లేక పెళ్లిరోజు కాబట్టి పిల్లల ప్రమేయం లేకుండా ఈ జంటే ఎగురుకుంటూ మాల్దీవులకు వచ్చిందో తెలియదు. మొత్తానికి నాలుగు డబ్బులు చేతిలో ఉంటే ఎంజాయ్‌కి ఇబ్బందేమీ ఉండదని అనసూయ జంట నిరూపిస్తోంది. కాగా ప్రస్తుతం అనసూయ తనని అందరు 'రంగమ్మత్త'అని పిలుస్తున్నారు. దీనిని విని ఎంతో ఆనందంగా ఉంటోంది. తాజాగా నాలుగు చిత్రాలలో మంచి మంచి పాత్రలను ఒప్పుకున్నానని ఆమె చెప్పుకొచ్చింది. 

Anchor Anasuya celebrates wedding anniversary:

Anchor Anasuya Bhardwaj Wedding Anniversary Trip at Maldives
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs