Advertisement
Google Ads BL

ఐటెం భామ అన్నందుకు.. భలే క్లాస్ పీకింది!


నిన్నటితరం హీరోయిన్లు ఫేడవుట్‌ అయి, పెళ్లిళ్లు చేసుకుని, పిల్లలకు తల్లులు అయిన తర్వాత అమ్మా,అక్క, వదిన వంటి సపోర్టింగ్‌ రోల్స్‌కి షిఫ్ట్‌ కావడం అందరినీ తెలిసిన విషయమే కానీ నిన్నటితరంలో మంచి నటిగా పేరు తెచ్చుకున్న కస్తూరి మాత్రం భిన్నమైన దారిలో నటిస్తోంది. ఆమె తెలుగులో చేసిన 'సోగ్గాడి పెళ్లాం, మా ఆయన బంగారం' వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. కాగా ఈమె ఆమద్య తెలుగులో 'సుడిగాడు'కి ఒరిజినల్‌ వెర్షన్‌ అయిన 'తమిళపదం' చిత్రంలో నటించింది. 2010లో ఈ చిత్రం విడుదలైంది. ఆమె తన రీఎంట్రీ తమిళపదంతో ఇచ్చిన తర్వాత తన వయసుకు తగ్గ పాత్రలనే చేస్తూ వచ్చింది. 

Advertisement
CJ Advs

తాజాగా ఆమె 'తమిళపదం'కి సీక్వెల్‌గా వస్తున్న 'తమిళపదం2.0'లో ఓ ఐటంసాంగ్‌ చేసింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌లో ఆమె ఐటం భామగా కనిపించింది. దాంతో ఈ వయసులో కూడా పర్‌ఫెక్ట్‌ బాడీ షేప్‌లు మెయిన్‌టెయిన్‌ చేస్తోన్న ఆమెపై పలువురు అభినందనలు వ్యక్తం చేస్తుండగా,ఓ నెటిజన్‌ మాత్రం దానికి విరుద్దంగా స్పందించాడు. బాధ్యత కలిగిన తల్లిగా ఉండాల్సిన స్త్రీ ఇలా ఐటం సాంగ్స్‌లో నటించడం ఎంత వరకు సబబు అని ఆయన ప్రశ్నించాడు. దానికి కస్తూరి కూడా ఘాటుగానే సమాధానం ఇచ్చింది. 

పెళ్లయిన మగాళ్లు మద్యం సేవించే సన్నివేశాలు, ఐటం సాంగ్స్‌ చేస్తున్నారు. మరి వారికి పిల్లల పట్ల బాధ్యత ఉండాల్సిన పనిలేదా? ఈ విషయంలో వాళ్లను ఎందుకు ప్రశ్నించరు. అమ్మనైనంత మాత్రాన ఐటం సాంగ్స్‌ చేయకూడదని రూలేం లేదు కదా..! స్త్రీ,పురుష సమానత్వం ఇప్పుడిప్పుడే సమాజానికి తెలుస్తోంది. ఇలాంటి మాటలతో దానిని పాతాళానికి తొక్కేయకండి.. అనిసమాధానం ఇచ్చింది. కస్తూరి చెప్పిన దాంట్లో 100శాతం నిజం ఉంది. ఇక ఈ 'తమిళపదం2.0'ని భీమనేని శ్రీనివాసరావు అల్లరినరేష్‌, సునీల్‌లతో రీమేక్‌ చేయాలని భావిస్తున్నాడు. మరి అది కార్యరూపం దాల్చుతుందో లేదో వేచిచూడాల్సివుంది...! 

Kasturi's Fitting Reply To A Netizen!:

Kasturi Fires on Netizen 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs