Advertisement
Google Ads BL

దగ్గుబాటి రానా కి ఏమైంది?


తెలుగులో హీరో అనే కన్నా మంచి నటుడు అని గుర్తింపు తెచ్చుకున్నవారిలో దగ్గుబాటి రానా ఒకరు. మహేష్‌, రామ్‌చరణ్‌ నుంచి సందీప్‌కిషన్‌ వరకు అందరు ద్విభాషా చిత్రాలు సరిగా ఆడక ఇబ్బందులు పడుతుంటే మల్టీలాంగ్వేజ్‌ నటునిగా రానాకి మాత్రం మంచి ట్రాక్‌ రికార్డు వుంది. ఇక ఈయన తనకు పుట్టుకతో కుడికన్ను సరిగా కనిపించేది కాదని, నాడు ఎల్‌.వి ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌లో తనకు మరో వ్యక్తి కన్నుఅమర్చారని చెప్పారు. ఇతరులు జాలి చూపించడం అంటే నచ్చని ఈ హీరో మరలా కంటి సమస్యతో బాధపడుతున్నాడట. దాంతో విదేశాలలో సర్జరీ కోసం ఆయన త్వరలో వెళ్లనున్నాడు. 

Advertisement
CJ Advs

ఈ విషయాన్ని ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ ఆపరేషన్‌ ఇండియాలో జరగదని చెప్పిన ఆయన కుటుంబ సభ్యులందరు ఈ ఆపరేషన్‌ సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. కాగా ప్రస్తుతం రానా చాలా చిత్రాలతో బిజీబిజీగా ఉన్నాడు. కొన్ని చిత్రాల షూటింగ్‌లు పూర్తి అయ్యాయి. మిగిలిన వాటికి బ్రేక్‌ ఇచ్చాడు. త్వరలో కంటి ఆపరేషన్‌ కోసం విదేశాలకు వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. ఈయన ఆపరేషన్‌ పూర్తి అయిన తర్వాతనే తేజతో ఆయన చేసే చిత్రం ఉండనుందని తెలుస్తోంది. మరి రానా కంటి ఆపరేషన్‌ సక్సెస్‌ కావాలని అందరం కోరుకుందాం....!

High BP For Rana!?:

Rana to undergo an eye surgery
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs