Advertisement
Google Ads BL

అందాల విందే కానీ మ్యాటర్ ఏం లేదంట!


బాలీవుడ్ లో నలుగురు భామలు తమ అందచందాలతో గత రెండు నెలలుగా  తెగ రచ్చ చేస్తూ అందరి చూపులని తమ వైపు తిప్పుకుంటున్నారు. వీర్ దే వెడ్డింగ్ అంటూ ఇద్దరు పెళ్లికాని భామలతో.. ఇద్దరు పెళ్ళైన భామలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వీర్ దే వెడ్డింగ్ సినిమా ప్రమోషన్స్ కోసం కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వర భాస్కర్, శిక్షా తల్సానియాలు తమ అందాలు ఆరబోస్తూ చేసిన రచ్చ కాస్త మితిమీరిందనే చెప్పాలి. సోనమ్ కపూర్, కరీనా కపూర్ లు అడ్డు అదుపు లేకుండా రెచ్చి పోయారు. మరి బికినీ షోస్ తోనూ, హాట్ హాట్ డ్రెస్సులతోను ఈ నలుగురు భామలు ఒక రేంజ్ లో రెచ్చిపోయారంటే నమ్మాలి.

Advertisement
CJ Advs

మరి వారు చేసిన రచ్చకి వీర్ దే వెడ్డింగ్ సినిమా ఎలాంటి ఫలితాన్నిచ్చింది అంటే.... నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన వీర్ దే వెడ్డింగ్ సినిమా సో సో గా ఉందని బాలీవుడ్ వర్గాల భోగట్టా. ఈ సినిమా ఎమోషనల్ గా కాకా మరీ బోల్డ్ గా ఉందనే కామెంట్స్ పడుతున్నాయి. ఈ సినిమాలో నలుగురు అమ్మాయిల కథలను వేర్వేరు రీజన్స్ తో దర్శకుడు చూపించాడు. కరీనా కపూర్ బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది కానీ.... పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించదు. ఇక మరో అమ్మాయి సోనమ్ కపూర్ పెళ్లి చేసుకుని.. అతనితో విడిపోయి మళ్ళీ మరో వ్యక్తి ని పెళ్లి చేసుకోవాలని వెతుక్కునే అమ్మాయి. ఇక స్వర భాస్కర్ భర్త డామినేషన్ ని తట్టుకోలేక.. అతని నుండి విడిపోవాలని తెగ ట్రై చేసే అమ్మాయి. ఇక నాలుగో అమ్మాయి శిక్షా తల్సా పేరెంట్స్ ని కాదని పెళ్లి చేసుకున్నాక కూడా... ఇంకా ఎదో వెలితిగా ఫీల్ అయ్యే అమ్మాయిగా నటించారు.

అలా నాలుగు ప్రోబ్లెంస్ లో ఉన్న ఆ నలుగురు అమ్మాయిలు ఒక పెళ్లిలో కలుసుకుంటారు. అయితే ఆ పెళ్లి వారి జీవితాలని ఎలాంటి మలుపు తిప్పుతుందో అనేది మిగతా కథ. అయితే దర్శకుడు నలుగురు హీరోయిన్స్ ని ఫుల్ గా హాట్ గా వాడేసుకున్నాడు. అలాగే హీరోయిన్స్ కూడా తెగ హాట్ అందాలతో రెచ్చిపోయారు. అసలు కరీనా కపూర్ అయితే ఈ రేంజ్ లో ఎప్పుడు అందచందాలను ప్రదర్శించలేదేమో అన్నట్టుగా గ్లామర్ షో చేసింది. ఇక సోనమ్ కపూర్ కూడా పెళ్లి జరిగినా కూడా ఏమాత్రం సిగ్గు బిడియం లేకుండా అంగాంగ ప్రదర్శన చేసింది. మిగతా హీరోయిన్స్ కూడా తమ శక్తిమేర అందాల ప్రదర్శనకి దిగారు. కానీ సినిమాకి మాత్రం ఓ అన్నంత టాక్ అయితే రాలేదు. అయితే సినిమాని ఉన్నంతలో సోనమ్ కపూర్ అండ్ కరీనా కపూర్ కాపాడే ప్రయత్నం చేసినా.. దర్శకుడి తప్పిదాల వల్ల సినిమాకి ఓ అన్నంత కలెక్షన్స్ అయితే రావన్నది బాలీవుడ్ టాక్. 

Average Talk to Veere di Wedding Movie:

Veere di Wedding Report
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs