ప్రస్తుతం దేశం మొత్తం 'హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్' ఛాలెంజ్‌లో పాల్గొంటున్నారు. కేంద్రమంత్రి, మాజీ ఒలింపిక్ విజేత రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ ప్రారంభించిన ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. సినీనటులు, క్రీడాకారులు, సెలబ్రిటీలందరు ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటు ఇతరులకు ఛాలెంజ్‌లను విసురుతున్నారు. ఇక తాజాగా అక్కినేని అఖిల్ తన తండ్రి నాగార్జునకు ఫిట్ నెస్ ఛాలెంజ్‌ని విసిరిన సంగతి తెలిసిందే. దాంతో నాగార్జున ఆ ఛాలెంజ్‌ని స్వీకరించాడు. జిమ్‌లో తాను చేస్తున్న వర్కౌట్స్ వీడియోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. అలాగే తన వంతుగా నేచురల్ స్టార్ నాని, కోలీవుడ్ స్టార్ కార్తిలతో పాటు హీరోయిన్ శిల్పారెడ్డి కూడా ఈ ఛాలెంజ్‌గా పాల్గొనాలని ఛాలెంజ్ విసిరాడు.
ఇక నాగార్జున ఛాలెంజ్ విసిరిన కార్తి నాగ్‌తో గతంలో 'ఊపిరి' చిత్రంలో నటించగా, ప్రస్తుతం నాగార్జున నేచురల్‌స్టార్ నానితో ఓ మల్టీస్టారర్ చేస్తున్నాడు. ఇలా తాను నటించిన ఇద్దరికీ ఆయన సవాల్ విసరడం విశేషం. ఇక నాగార్జున 58ఏళ్ల వయసులో కూడా ఎంతో ఫిట్‌గా, ఎంతో బరువు మోస్తూ తీసిన వీడియోను చూస్తే ఈయన నవమన్మధుడు అనిపించేలా ఉన్నాడని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక నాగ్‌ది మామూలుగానే సిక్స్‌ప్యాక్ బాడీ అన్న సంగతి తెలిసిందే.
సినిమాల విషయానికి వస్తే ఆయన రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో నటించిన 'ఆఫీసర్' తాజాగా విడుదలైన డిజాస్టర్స్ టాక్‌ని తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం ఆయన నానితో పాటు ధనుష్ దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నాడు. మరి కళ్యాణ్‌కృష్ణతో ఆయన 'బంగార్రాజు' చిత్రం ఉంటుందో లేదో చూడాల్సివుంది...!