Advertisement
Google Ads BL

'అభిమన్యుడు' ని అలా వదిలేశారేంటి!


కోలీవుడ్ లో గత నెల 11 న విడుదలైన ఇరుంబుతిరై సినిమా సూపర్ హిట్ రివ్యూస్ తో పాటుగా మంచి కలెక్షన్స్ కొల్లగొట్టిన సినిమా. విశాల్ హీరోగా సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అక్కడ ఘన విజయం సాధించింది. అయితే అదే సినిమాని తెలుగులో  అభిమన్యుడు అనే పేరుతో అనువదించి నిన్న శుక్రవారం విడుదల చేశారు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ అభిమన్యుడు మూవీ నిన్న శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ కొట్టేసింది. రెండు తెలుగు సినిమాలను వెనక్కి నెట్టి మరీ విజయం సాధించిన ఈ సినిమాకి తెలుగులో కలెక్షన్స్ వస్తాయంటే మాత్రం కాస్త డౌటే అంటున్నారు. 

Advertisement
CJ Advs

ఎందుకంటే తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాని తెలుగులో ఎలాంటి హడావిడి లేకుండా థియేటర్స్ లోకి దింపేశారు. ఏదో ఒకసారి విశాల్, సమంత, దర్శకుడు కలిసి అభిమన్యుడు ప్రెస్ మీట్ అంటూ హడావిడి చెయ్యడం తప్ప ఈ సినిమాకి మిగతా ప్రమోషనల్ కార్యక్రమాలను మరిచారు. మరి తెలుగులో డబ్ చేసి విడుదల చేసిన నిర్మాత హరి అభిమన్యుడు సినిమా ప్రమోషన్స్ విషయంలో బాగా లైట్ తీసుకున్నట్టుగా కనబడుతుంది. అసలు అనుకున్న స్థాయిలో అభిమన్యుడు ప్రమోషన్స్ చేసినట్టయితే... ఈ సినిమాకి కేవలం హిట్ టాక్ మాత్రమే కాదు.. సూపర్ హిట్ కలెక్షన్స్ కూడా వచ్చేవి. కనీసం టాప్ హీరోయిన్ అయిన సమంత ఇంటర్వ్యూ అలాంటివి ఏమన్నా చేసినట్లయితే.. అభిమన్యుడుకి కలిసొచ్చేది.

మరి అక్కడ హిట్ అయ్యింది.. ఇక్కడ ఎలాగైనా హిట్ కొడుతోంది అనుకున్నారేమో అభిమన్యుడు నిర్మాతలు. అందుకే అభిమన్యుడు ప్రమోషన్స్ మీద అస్సలు దృష్టి పెట్టలేదు. ఇక ఎలాగూ హిట్ టాక్ తెచ్చుకుంది.. కలెక్షన్స్ కుమ్మేస్తాయనే రోజులు కావాయే. తమ సినిమాని ప్రేక్షకుల్లోకి ఎంతగా తీసుకెళ్తే అంతగా కలెక్షన్స్ పెరుగుతాయనే చిన్న విషయాన్ని అభిమన్యుడు నిర్మాతలు విస్మరించినట్టుగా కనబడుతున్నారు. ఏది ఏమైనా అభిమన్యుడుకి కావాల్సిన ప్రమోషన్స్ చెయ్యలేదు కాబట్టి కలెక్షన్స్ కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటాయనేది ట్రేడ్ మాట.

No Promotions to Vishal Abhimanyudu:

Abhimanyudu Got Positive Talk, But No Publicity
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs