Advertisement
Google Ads BL

'అభిమన్యుడు'కి మంచి మార్కులు పడ్డాయ్!


ఈ శుక్రవారం ఏకంగా మూడు సినిమాలు థియేటర్స్ లో సందడి చేశాయి. అందులో నాగార్జున - రామ్ గోపాల్ వర్మల 'ఆఫీసర్' సినిమా ఒకటి కాగా.. రెండోది రాజ్ తరుణ్ 'రాజుగాడు'. ఇక ముచ్చటగా టాలీవుడ్ సినిమాలకు ధీటుగా బరిలోకి దిగిన కోలీవుడ్ సినిమా 'అభిమన్యుడు' మూవీ మూడోది. తెలుగు నుండి స్ట్రయిట్ గా 'ఆఫీసర్, రాజుగాడు' ఉండగా... అరవం నుండి 'అభిమన్యుడు' తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూడు సినిమాల్లో తెలుగు సినిమాలు రెండు చిన్నబోగా... అరవ సినిమా మాత్రం అదరగొట్టేసింది. విశాల్ - సమంత జంటగా కోలీవుడ్ లో తెరకెక్కిన 'అభిమన్యుడు' సినిమా అక్కడ కోలీవుడ్ లో సూపర్ హిట్ కాగా... ఇప్పుడు తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది.

Advertisement
CJ Advs

నాగార్జున 'ఆఫీసర్' సినిమాని తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ ఎప్పటిలాగే మళ్ళీ ప్లాప్ సినిమా నిచ్చాడు. గతంలో టాప్ డైరెక్టర్ అయిన రామ్ గోపాల్ వర్మ గత కొంతకాలంగా అస్సలు ఫామ్ లో లేడు. ఇక దానితో పాటుగా నిత్యం వివాదాల వెంట వుండే వర్మ నాగార్జునకు 'ఆఫీసర్' తో భారీ షాక్ ఇచ్చాడు. ఈ సినిమా అస్సలు ప్రేక్షకులను ఏ విధంగానూ మెప్పించలేక చేతులెత్తేసింది. ఇక ఈ మధ్యన ఫామ్ కోల్పోతున్న హీరో రాజ్ తరుణ్ ఇప్పుడు కొత్త డైరెక్టర్ తో చేతులు కలిపి 'రాజుగాడు' చేసాడు. మరి ఆ సినిమా కూడా ప్లాప్ బాట పట్టేసింది. విడుదలైన మొదటి షోకే ప్లాప్ టాక్ తెచ్చుకున్న రాజ్ తరుణ్ సినిమాల్లోకెల్లా భారీ డిజాస్టర్ గా 'రాజుగాడు' మిగులుతుందని... అంటున్నారు.

మరి రెండు తెలుగు సినిమాలు బరిలో ఉన్నప్పటికీ.. ఏమాత్రం బెదరకుండా ధైర్యంగా థియేటర్స్ లోకొచ్చిన అరవ సినిమా 'అభిమన్యుడు' మాత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని... తెలుగు సినిమాలకు చెక్ పెట్టింది. మిలటరీ ట్రైనర్ గా ఉన్న విశాల్ చాలా కోపిష్టి. చెల్లెలికి పెళ్లి చేసే ప్రయత్నంలో బ్యాంక్ లోన్ తీసుకుంటే.. అనుకోకుండా ఆ డబ్బు అకౌంట్ నుండి మాయమవడం.. దానిని ఛేదించే క్రమంలో వైట్ డెవిల్..(యాక్షన్ కింగ్ అర్జున్) తో ఢీ కొనడం వంటి సైబర్ క్రైం నేరాలు మానవుని జీవితంలోకి ఎంతగా చొచ్చుకుపోయాయి అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించిన దర్శకుడు మిత్రన్ ని అందరూ పొగిడేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ కథతో తెరకెక్కిన ఈ సినిమాకి తెలుగు క్రిటిక్స్ పాస్ మార్కులు వేసేసారు. మరి ఈ శుక్రవారం పోటీపడిన రెండు తెలుగు సినిమాల మీద ఈ అరవ సినిమా పై చేయి సాధించింది.

Positive Reports to Vishal's Abhimanyudu:

Officer and Rajugadu Movie Talks at Box Office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs