Advertisement
Google Ads BL

తాతగారి పాత్ర చేయడానికి భయపడ్డాడంట!


సావిత్రి బయోపిక్‌గా వచ్చిన 'మహానటి'లో ఏయన్నార్‌ పాత్రను నాగచైతన్య పోషించాడు. కానీ ఎన్టీఆర్‌ పాత్రను పోషించడానికి యంగ్‌టైగర్‌ మాత్రం గట్స్‌ చాలక నో చెప్పాడు. ఇక ఈ చిత్రంలో తాను తన తాతగారి పాత్రను చేసిన విషయంపై నాగచైతన్య స్పందించారు. 

Advertisement
CJ Advs

ఆయన మాట్లాడుతూ.. తాతగారి పాత్రలో చేయమని నాగ్‌అశ్విన్‌ కోరినప్పుడు ఎంతో కంగారు పడ్డాను. నాన్న ఒప్పుకోరేమో అన్నాను. టెస్ట్‌ షూట్‌ నాడు అశ్విన్‌ నాతో 14టేక్స్‌ తీయించాడు. కానీ ఈ సినిమాకి 14 కాదు.. 500, 1000టేక్స్‌ తీసినా ఫర్వాలేదనిపించింది. తాతగారి పాత్ర కావడంతో పర్‌ఫెక్ట్‌గా ఉండాలని కోరుకున్నాను. అశ్విన్‌, సెట్స్‌లోని అందరు ఎంతో సహకరించారు. తాతలా నటించకపోయినా ఫర్వాలేదు ఆ ఎసెన్స్‌ ఉంటే చాలని డైరెక్టర్‌ చెప్పారు. దాంతో నా పని కాస్త సులువైంది.

15ఏళ్ల కింద కాలేజీలో 'దేవదాసు' చిత్రం చూశావా? అని అడిగారు. లేదని చెప్పడంతో బయటికి పంపారు. అదే దేవదాసు వంటి పాత్రలో ఇందులో నటించడం అద్భుతం అనిపించింది. తాతగారి పాత్రను చేయడానికి మొదట భయపడినా ఇప్పుడు తృప్తిగా ఉంది. నేను కాకుండా ఎవరో చేసి ఉంటే నేడు నేను బాధపడుతూ ఉండేవాడిని. కంటెంట్‌ ఉంటే ప్రేక్షకులు ఏ చిత్రమైనా ఆదరిస్తారని చెప్పడానికి 'మహానటి' గొప్ప ఉదాహరణ అని చైతూ చెప్పుకొచ్చాడు.

Naga Chaitanya About Mahanati ANR Role:

Naga Chaitanya Reveals About ANR Role In Mahanati Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs