Advertisement
Google Ads BL

ఈ హీరోయిన్ లాయర్ల వెంట పడుతోంది!


'అభిలాష' నవల రాసే దాకా యండమూరివీరేంద్రనాధ్‌ కూడా కోర్టులో విచారణ అంటే సినిమాలలో చూపించినట్లే జరుగుతుందని భావించాడు. ఈ నవల కోసం ఆయన నిజంగా కోర్టులకి వెళ్లిన తర్వాత అసలు విషయం తెలిసింది. ఇప్పుడు నటిగా కాకపోయినా ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ల ద్వారా ప్రేక్షకులకు బాగా పరిచయమైన యామీ గౌతమ్‌ కూడా అదే పనిచేస్తోంది. ఆమె ప్రస్తుతం శ్రీనారాయణ్‌సింగ్‌ దర్శకత్వంలో షాహిద్‌కపూర్‌ హీరోగా నటిస్తోన్న 'బట్టిగుల్‌ మీటర్‌ చలు' అనే చిత్రంలో లాయర్‌ పాత్రను పోషిస్తోంది. ఇందులో శ్రద్దాకపూర్‌ కూడా నటిస్తోంది. 

Advertisement
CJ Advs

చిన్నపట్టణాలలో ఎదురయ్యే విద్యుత్‌ సమస్యల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. కోర్టు ప్రొసీడింగ్స్‌ ఎలా ఉంటాయి? ప్రాసిక్యూషన్‌ బాధితుల పట్ల ఎలా వ్యవహరిస్తుంది? అనే విషయాలను నిజంగా కోర్టుకి వెళ్లి తెలుసుకోవాలని భావించాను. ఈ విషయంలో నాకు సహాయం చేయమని నా స్నేహితురాలైన లాయర్‌ని అడిగాను. కానీ ఇప్పుడైతే కోర్టుకి సెలవులు . కానీ అదృష్టం కొద్ది ఆ స్నేహితురాలైన లాయర్‌ వారి స్నేహితులైన లాయర్లతో కలిసి వెకేషన్‌ బెంచ్‌ సెక్షన్‌ నిర్వహిస్తున్నారు. వాటికి వెళ్తూ కోర్టులో అసలు విచారణ ఎలా ఉంటుంది? అనే విషయంలో అవగాహన పెంచుకుంటున్నానని యామీ గౌతమ్‌ తెలిపింది. 

ఇక ఈమె ఈ చిత్రంతో పాటు ఆదిత్యధార్‌ దర్శకత్వంలో 'ఉరి' చిత్రంలో కూడా నటిస్తోంది. 2016 సెప్టెంబర్‌లో 'ఉరి సెక్టార్‌'లో జరిగిన సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో యామీ గౌతమ్‌ పవర్‌ఫుల్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌ పాత్రను పోషిస్తోంది. 

Yami Gautam SPOTTED at Bombay HC:

Yami Gautam has started prepping up for her next film Batti Gul Meter Chalu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs