Advertisement
Google Ads BL

అసలైన సూపర్‌స్టార్‌వి నువ్వే నాన్నా!


తెలుగుతెరపై అగ్రకథానాయకునిగా కృష్ణ చెరగని ముద్రవేశారు. చిరంజీవి సుప్రీంస్టార్‌ అయ్యేనాటికి కూడా కృష్ణనే సూపర్‌స్టార్‌. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ల తర్వాత ఆ స్థాయి పేరు ప్రఖ్యాతులు, క్రేజ్‌ కృష్ణకే సొంతం. నాడు సినీ పత్రికగా ఉన్న జ్యోతిచిత్రలో సూపర్‌స్టార్‌ పోటీలను నిర్వహిస్తే ప్రతిసారి కృష్ణనే సూపర్‌స్టార్‌గా నిలిచేవాడు. ఇక ఈయన ఎంతో డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ హీరోగా, భారీతనానికి, ప్రయోగాలకు వెరవని నైజం ఆయనది. తెలుగు తెరకు భారీ తనం చేకూర్చిన నిర్మాతగా, దర్శకునిగా కూడా ఆయన పేరే చెప్పవచ్చు. 'అల్లూరిసీతారామరాజు, సింహాసనం' వంటి చిత్రాలు ఈ విషయాన్ని నిరూపిస్తాయి. సాహసంతో కూడిన ఎన్నో డేరింగ్‌ నిర్ణయాలు తీసుకుని ఆయన విజయపధంలో దూసుకెళ్లారు. 

Advertisement
CJ Advs

అంతేకాదు.. ఆయన రియల్‌ హీరో అనిపించుకున్నాడు. తనవల్ల ఏ నిర్మాత నష్టపోకూడనేది ఆయన మనస్తత్వం. ఈ విషయంలో దేశంలోనే నిర్మాతలను ఎంతో ఆదుకున్న హీరోగా, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఈయన చూపించే తెగువ చూసి నిజమైన హీరో అంటే ఇలా ఉండాలి అనుకునేవారు. నేడు ఆయన కుమారుడు మహేష్‌బాబుని అందరు సూపర్‌స్టార్‌ అంటున్నారు. 

ఇక సూపర్‌స్టార్‌ కృష్ణ జన్మదినం సందర్భంగా మహేష్‌బాబు మాట్లాడుతూ.. 'నా గురువు...నా బలం.. నా స్ఫూర్తి మీరే. మీ కొడుకుగా పుట్టినందుకు గర్వపడుతున్నాను. ఎప్పటికీ మీరే సూపర్‌స్టార్‌. హ్యాపీ బర్త్‌డే నాన్నా..' అని ట్వీట్‌ చేశాడు. ఇక మహేష్‌ నటించిన ప్రతి చిత్రాన్ని కృష్ణ చూసి విశ్లేషణ చేస్తూ ఉంటారు. ఏ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తోంది? ఎంత ప్రేక్షకాదరణ పొందుతోంది? అనేవి కృష్ణనే విశ్లేషిస్తూ ఉంటారు.

ఇక కృష్ణ బర్త్‌డే సందర్భంగా ఆయన తన అల్లుడు సుధీర్‌బాబు నటించిన 'సమ్మోహనం' ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సుధీర్‌బాబు కృష్ణ గారి బయోపిక్‌లో ఎవరు నటిస్తే బాగుంటుంది? ఎవరు దర్శకత్వం వహిస్తే బాగుంటుంది? అని ప్రశ్నించగా ఎప్పుడో తీయబోయే చిత్రం గురించి ఇప్పుడు ఎందుకు అంటూ కృష్ణ నవ్వుతూ సమాధానం ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంటోంది..! 

Mahesh Babu birthday Wishes to Father Superstar Krishna:

My real hero, My Pillar of Strength: Mahesh Babu wishes His Father Krishna
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs