Advertisement
Google Ads BL

ఆర్.జె, తేజ్ టీమ్లు కొట్టుకుంటే పాటొస్తది!


రెండేళ్లకిందట సుప్రీం చిత్రంతో ఏకంగా 25కోట్ల మార్కెట్‌ని తాకాడు మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌. తాజాగా ఆయన వరుస పరాజయాలతో తానేనా అంతటి హిట్‌నిచ్చింది అని తనకు తానే సందిగ్దంలో పడిపోయేంతగా ఆయన చిత్రాలు వరుసగా పరాజయాల పాలవుతున్నాయి. 'తిక్క నుంచి మొదలై విన్నర్‌, జవాన్‌, ఇంటెలిజెంట్‌'తో ఈ ఫ్లాప్స్‌ ఆయన కెరీర్‌నే సందిగ్దంలో పడేశాయి. దాంతో ఈసారి తన చిన్నమావయ్య పవన్‌కళ్యాణ్‌కి 'తొలిప్రేమ' వంటి బ్లాక్‌బస్టర్‌ని అందించిన ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న కరుణాకరన్‌ దర్శకత్వంలో గతంలో ఎవర్‌గ్రీన్‌ హిట్స్‌ని అందించిన సీనియర్‌ నిర్మాత కె.యస్‌.రామారావుకి చెందిన క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బేనర్‌లో సాయి ప్రస్తుతం 'తేజ్ ఐ లవ్‌యు' చిత్రం చేస్తున్నాడు. 

Advertisement
CJ Advs

ఇక ఈ చిత్రం కోసం విడుదల చేసిన ప్రమోషన్‌ మెటీరియల్స్‌ అయిన పోస్టర్స్‌, లుక్స్‌ మంచి లవ్‌ మూవీని, ఫ్రెష్‌ ప్రేమకథను, క్యూట్‌ మూవీని చూడబోతున్నామా? అనే నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. ఇక ఈ ప్రమోషన్‌లో భాగంగా సాయిధరమ్‌తేజ్‌ చేతిలో గిటార్‌ పట్టుకుని పాప్‌సింగర్‌గా కనిపిస్తున్న గెటప్‌ ఉన్న పోస్టర్‌పై మాత్రం నెగటివ్‌ కామెంట్స్‌ వస్తున్నాయి. గతంలో కరుణాకరన్‌ దర్శకత్వంలో వచ్చిన వెంకటేష్‌ 'వాసు', ప్రభాస్‌ 'డార్లింగ్‌' చిత్రాలలో కూడా హీరోలు ఇలా కనిపించిన వారే. అయినా గిటార్‌ పట్టుకున్నంత మాత్రాన ఆ చిత్రాలతో పోలిక తేవడం ఏమిటని తేజు అంటున్నాడు. మరికొందరు ఈ పోస్టర్‌ నాని 'కృష్ణార్జునయుద్దం'లోని గెటప్‌ని పోలి ఉందని కూడా గుసగుసలాడుతున్నారు. మరోవైపు తేజు నటిస్తున్న ఈచిత్రం ఓవర్‌సీస్‌ రైట్స్‌ 75లక్షలకు అమ్ముడు పోయాయి. ఇది అంత పెద్ద మొత్తం కాకపోయినా తేజుకి ఓవర్‌సీస్‌లో ఉన్న క్రేజ్‌ని బట్టి చూస్తే పెద్ద మొత్తమే అని చెప్పాలి. 

ఇక ఈ చిత్రంలోని తొలి పాటను విడుదల చేయడానికి రంగం సిద్దమైంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా రేడీయో జాకీ టీంకి, 'తేజ్ ఐ లవ్‌యు'  టీంకి మధ్య జూన్ 2 న క్రికెట్‌ లీగ్‌ పోటీని ఏర్పాటు చేశారు. ఇందులో గెలిచిన వారి చేతుల మీదుగా మొదటి పాటను విడుదల చేస్తామని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. 'అందమైన చందమామ' అనే మొదటి పాటను ఎవరు రిలీజ్‌ చేస్తారో చూడాలి. ఇక ఈ చిత్రానికి అనుపమ పరమేశ్వరన్‌ నటన, గోపీసుందర్‌ మ్యూజిక్‌లు హైలైట్‌ కానున్నాయట. ఈ చిత్రాన్ని ఈనెల 29న విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. మరి ఈ చిత్రంతోనైనా తేజు గాడిలో పడతాడో లేదో వేచిచూడాల్సివుంది! 

Cricket Match between RJ's Team and Tej I Love You team:

Tej I Love You Movie 1st Song Release Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs