కేంద్రమంత్రి, ఒలింపిక్ పతక వీరుడు రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ విసిరిన ఫిట్‌నెస్ ఛాలెంజ్ సోషల్‌మీడియాలలో ఒక సెలబ్రిటీ నుంచి మరో సెలబ్రిటీకి పాకుతూ వైరల్ అవుతోంది. ఈ విధంగా ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ని అందరు అందుకుంటున్నారు. తాజాగా మలయళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ని స్వీకరించి, డంబెల్స్, ఇతర వ్యాయామాలు చేస్తూ తన దీనిని యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌కి ఛాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే. దీనిని ఎన్టీఆర్ స్వీకరించారు. ఆయన తాను జిమ్ చేస్తోన్న వీడియోను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ, తాను నిత్యం తన ట్రైనర్ పర్యవేక్షణలో ఫిట్నెస్ కోసం జిమ్ చేస్తూ ఉంటానని తెలిపాడు.
అదే సమయంలో ఆయన మహేష్‌బాబు, రామ్‌చరణ్, రాజమౌళి, కొరటాల శివ, నందమూరి కళ్యాణ్‌రామ్‌లకు 'హమ్ ఫిట్‌తో ఇండియా ఫిట్' ఛాలెంజ్‌ని విసిరాడు. రామ్‌చరణ్‌కి ట్విట్టర్ అకౌంట్ లేకపోవడంతో ఆయన రామ్‌చరణ్ సతీమణి ఉపాసనకు ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్ గురించి చెప్పి తన భర్తకి తెలియజేయమని ఆమెని కోరాడు. ఇక దేశంలో బాలీవుడ్ టాలీవుడ్‌ల నుంచి మాల్లూవుడ్, కోలీవుడ్‌ల వరకు సినీ సెలబ్రిటీలందరు ఈ ఛాలెంజ్‌లను పలువురికి విసురుతూ, తాము ఛాలెంజ్‌లను స్వీకరిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.
మొత్తానికి స్వచ్చభారత్ అంటూ పది పైసల ఖర్చులేని నినాదం ద్వారా వార్తల్లో నిలిచిన బిజెపి ప్రభుత్వం ఇప్పుడు ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్ ద్వారా కూడా పలువురిని ఆకట్టుకుంటూ వార్తల్లో నిలుస్తోంది. అయినా ఏదో ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్‌లో కాకుండా ఓ మంచి మార్పు కోసం చేస్తున్న ఈ ఛాలెంజ్‌ని అభినందిచాల్సిందేనని చెప్పాలి.