Advertisement
Google Ads BL

మహేష్ 27 కి హీరోయిన్ కూడా ఫిక్సయింది!


మహేష్ బాబు ప్రస్తుతం వంశి పైడిపల్లితో ఒక సినిమాని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఇక ఈ సినిమా ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకుని.. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు. మహేష్ బాబు, వంశి సినిమా షూటింగ్ పూర్తి కాగానే సుకుమార్ తో తన 26 వ చిత్రాన్ని చెయ్యడానికి కమిట్ అయ్యాడు. ఇక సుకుమార్ అప్పుడే మహేష్ తో చెయ్యబోయే సినిమా స్క్రిప్ట్ మీద కూర్చున్నాడనే టాక్ ఉంది. సుకుమార్ సినిమా పూర్తికాగానే మహేష్ బాబు అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగాతో  మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. మహేష్ - సందీప్ వంగా సినిమా పక్కా అనేది లేటెస్ట్ న్యూస్.

Advertisement
CJ Advs

అయితే సందీప్ వంగాతో సినిమా చెయ్యడానికి మహేష్, సందీప్ కి నామమాత్రంగా భరోసా ఇస్తే మహేష్ వైఫ్ నమ్రత మాత్రం  డైరెక్టర్‌కి అభయం ఇచ్చినట్టు సమాచారం అందుతుంది. ముందుగా సందీప్ వంగా మహేష్ ని కలవడం స్టోరీ లైన్ వినిపించడం జరిగిందని... ఆతర్వాత సందీప్ వంగా నమ్రతను కలిసి కథ మొత్తం పూర్తిగా చెప్పినట్టుగా చెబుతున్నారు. ఇక కథ విన్న నమ్రత... ఇలాంటి క్యారెక్టర్ మహేష్ గతంలో క్యారెక్టర్ చేయకపోవడం... అలాగే స్టోరీ కూడా బాగుందని ఆమె చెప్పడమే కాదు... త్వరలో కలిసి పనిచేద్దామని చెప్పడంతో సందీప్ హ్యాపీగా ఫీలయ్యాడని చెబుతున్నారు.

ఇక పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్న సందీప్ వంగాకి ఈ సినిమాలో మహేష్ పక్కన కాజల్ అగర్వాల్ అయితే బావుంటుందని మహేష్ కి చెప్పడంతో.. మహేష్ కూడా కాజల్ పట్ల సానుకూలంగా స్పందించడంతో.. మహేష్ పక్కన సందీప్ వంగా సినిమాలో దాదాపుగా  హీరోయిన్ గా కాజల్ ఫైనల్ అవుతుందని కూడా చెబుతున్నారు. ఇప్పటికే కాజల్ అగర్వాల్ - మహేష్ లు కలిసి బిజినెస్ మ్యాన్, బ్రహ్మ్మోత్సవం చిత్రాలలో నటించారు. మరి అందులో బిజినెస్ మ్యాన్ హిట్ కాగా.. బ్రహ్మ్మోత్సవం డిజాస్టర్ అయ్యింది. 

Heroine Fixed for Mahesh 27th Film:

Kajal Agarwal in Mahesh and Sandeep Vanga Movie  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs