Advertisement
Google Ads BL

ఎన్టీఆర్, వైఎస్సార్ బయోపిక్ ల హైలైట్స్!


టాలీవుడ్ లో బయోపిక్స్ కు ఎప్పుడూ డిమాండ్ ఉండేది కానీ మరి ఇంత డిమాండ్ ఎప్పుడు లేదు. లేటెస్ట్ గా 'మహానటి' సినిమాతో అర్ధం అయింది. ప్రేక్షకులకు కంటెంట్ ఉన్న బయోపిక్ ను తీస్తే ఖచ్చితంగా ఆదరిస్తారని రుజువు చేశారు. ఈ 'మహానటి' బయోపిక్ మరి కొన్ని బియోపిక్స్ కు దారి తీసింది.

Advertisement
CJ Advs

'మహానటి' సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే 'ఎన్టీఆర్'.. 'వైఎస్సార్' బయోపిక్స్ పై ప్రకటనలు వచ్చాయి. వీటిలో కంటెంట్ గురించి ఇప్పుడు విపరీతంగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ముందుగా 'ఎన్టీఆర్' బయోపిక్ గురించి మాట్లాడుకుందాం. 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ నటిస్తున్నాడు. ఈ సినిమా మొత్తం ఎన్టీఆర్ ఖ్యాతి గురించి ప్రచారం చేసే యాంగిల్ లోనే ఎక్కువ స్క్రిప్ట్ ను నడిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలకృష్ణ దాదాపు 70 గెటప్స్ వేయనున్నారు. అంటే దీనినిబట్టి 'ఎన్టీఆర్' బయోపిక్ లో 'ఎన్టీఆర్' నటన ప్రస్తావన గురించి ఎక్కువగా చెప్పనున్నారు. అయన పర్సనల్ లైఫ్, రాజకీయ కోణం కొంచం తక్కువగానే చూపించనున్నారని అర్ధం అవుతుంది.

కానీ 'వైఎస్సార్' బయోపిక్ ఇందుకు భిన్నంగా సాగనుందని అంటున్నారు. 'వైఎస్సార్' రాజకీయాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి సినిమా మొత్తం ప్రత్యర్ధి పార్టీల మీద విమర్శల బాణాలు బాగా ఎక్కువగానే ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. ఇటు సినిమాటిక్ టచ్ తో పాటు.. అటు పొలిటికల్ యాంగిల్ ను కూడా ఎక్కువగానే చూపించనున్నారట.

NTR Biopic vs YSR Biopic Yatra:

NTR Biopic and YSR Biopic Story HIghlights    
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs