Advertisement
Google Ads BL

రజినీ రూపంలో 'కాలా'కి కొత్త కష్టాలు!


సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కాలా సినిమా జూన్ 7 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒక్క కర్ణాటకలో మాత్రం కాలా విడుదలకు కష్టంగా కనబడుతుంది. కావేరి జలాల వివాదంలో రజిని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అక్కడ కర్ణాటక ప్రజలు కాలాను అడ్డుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టేసారు. ఇప్పటికే కర్ణాటక సెన్సార్ బోర్డు కాలా సినిమాని సెన్సార్ చెయ్యకుండా హోల్డ్ లో పెట్టింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు తమిళనాట కూడా కాలా సినిమా ప్రమోషన్స్ ని ఆపేసారు. నిన్నమొన్నటివరకు కాలా ప్రమోషన్స్ తో నిర్మాత ధనుష్ తో పాటుగా రజినీకాంత్, రంజిత్ పా లు సినిమా మీద హైప్ పెంచాలనుకున్నారు. అందుకే కాలా ప్రీ రిలీజ్ ఈవెంట్, కాలా ప్రెస్ మీట్ ని పెట్టాలనుకున్నారు. అందుకున్న సమాచారం ప్రకారం కాలా ప్రమోషన్స్ ని ఆపేసారని తెలుస్తుంది.

Advertisement
CJ Advs

కారణం తమిళనాడులోని తూత్తుకుడిలో జరుగుతున్న పరిణామాలు సూపర్ స్టార్ రజనీకాంత్ ని మార్చేస్తున్నాయి. ప్రస్తుతం రాజకీయాల్లోకి వస్తున్నానంటూ చెబుతున్న రజినీకాంత్ ఇప్పుడు అటు రాజకీయ నాయకుడిగాను, ఇటు నటుడిగాను మెలగాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే కాలా ప్రమోషన్స్ కి బ్రేక్ ఇచ్చి ప్రస్తుతం స్టెరిలైట్‌ ఫ్యాక్టరీకి  వ్యతిరేకంగా నిరసనలు జరిపిన ఆందోళనకారులను పోలీస్ లు నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరపగా.. ఆ ఘటనలో 13 మంది ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ 13 మంది మరణించిన నేపథ్యంలో బాధితుల కుటుంబాలను పరామర్శించాలని రజినీకాంత్ నిర్ణయించుకున్నారు.

అందుకే కాలా ప్రమోషన్స్ ని పక్కనబెట్టి తూత్తుకుడి వెళ్తున్నానని ... అక్కడి ఆ 13 మంది కుటుంబాలను ఓదార్చి.. మళ్లీ యెలాంటి రక్తసిక్తమైన ఘటనలు జరక్కుండా ఉండాలనేది తన కోరిక అంటూ... పోలీస్ కాల్పుల్లో చనిపోయిన కుటుంబాలకు అండగా ఉంటానని... ఆయన స్వయానా తెలియజేస్తున్నారు. మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళను చేసిన వారిని రజిని పరామర్శించి వారిని ఓదార్చడం అనేది మంచి విషయమే. కానీ కొంతమంది అంటే ఆందోళనకారులోని కొంతమంది రజిని సానుభూతి పర్యటనను వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తుంది.

Kaala Promotions Stopped for Thoothukudi Incident:

No Promotions to Kaala Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs