సింగర్ కపుల్స్‌గా హేమచంద్ర, శ్రావణ భార్గవిలకు మంచి గుర్తింపు ఉంది. మంచి పాటలు పాడటమే కాదు.. వీరు స్టేజీషోల ద్వారా కూడా బాగా పాపులర్. ఇక తాజాగా హేమచంద్ర మాట్లాడుతూ.. పాటలు పాడండి డబ్బులు ఇస్తామని చెప్పి, తర్వాత డబ్బు ఎగ్గొట్టడం చాలా దారుణం. ఒకసారి నేను కామారెడ్డిలో ఓ షోకి నా ట్రూప్‌తో వెళ్లాను. ప్రోగ్రాం ముగిసిన వెంటనే పేమెంట్ మొత్తం సెటిల్ చేస్తామని నిర్వాహకుడు మాట ఇచ్చాడు. షో పూర్తయిన తర్వాత అతను కనిపించలేదు. తీరా చూస్తే ఇతర నిర్వాహకులతో కలిసి మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత వెయిట్ చేసినా అతను రాలేదు. దాంతో నేనే అక్కడికి వెళ్లాను.
మాట్లాడుకున్న మొత్తం కంటే ఎక్కువ అడగుతున్నారని అన్నాడు. మీరు వెళ్లిపోండి రేపు డబ్బులు ఇస్తానని అన్నాడు. కాదు ముందుగా చెప్పినట్లు షో అయిపోయిన వెంటనే ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాను. మాటా మాటా పెరిగింది. దాంతో వాడికి నాలుగు తగిలించి హైదరాబాద్‌కి తెచ్చి పోలీస్‌స్టేషన్‌లో పెట్టించాను. మా డబ్బులు ఇచ్చిన తర్వాతే రిలీజ్ అయ్యాడు అని చెప్పుకొచ్చాడు.
ఇక శ్రావణ భార్గవి డ్రైవింగ్ అంటే నాకు టెన్షన్. ఆమె ఎప్పుడు డ్రైవ్ చేసినా ఒకటో గేర్‌లోనే వెళ్తుంది. ఆమె ఎప్పుడు గేర్ మారుస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాను. ఎంత సేపటికి ఒకటో గేరేనా మార్చు అంటే అలాగే అంటూ ఎప్పటికో మారుస్తుంది. షరా మామూలే. మరలా రెండో గేర్‌లోనే స్లోగా వెళ్తూ, నాకు స్టీరింగ్ ఇచ్చి తాను మాత్రం రోడ్డు పక్కన ఉండే షాపుల్లో బట్టలు చూస్తూ ఉంటుంది. ఆమెకి కారు కన్నా రోడ్‌రోలర్ బెటర్.
ఇక నా చిన్నప్పుడు మా నాన్న నాకు 20రూపాయలు ఇచ్చి రెండు పాల ప్యాకెట్లు తెమ్మని చెప్పాడు. అప్పుడు ప్యాకెట్ ధర 10రూపాయలు. రెండు ప్యాకెట్లు తెమ్మన్నాడు. నేను అక్కడే ఉన్న వీడియో గేమ్‌లో గంటకి ఐదు రూపాయల చొప్పున నాలుగు గంటలు ఆడాను. దాంతో మా నాన్న వీడియో గేమ్ సెంటర్‌కి వచ్చి నాలుగు పీకాడు. ఆ దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పుకొచ్చాడు.