Advertisement
Google Ads BL

ఒకప్పటి టాప్ హీరోయిన్ వారసుడొస్తున్నాడు!


సినిమాలలో, రాజకీయాలలో వారసత్వాలు బహుమామూలు వ్యవహారంగా అయిపోయాయి. ఒకటి రెండు హిట్స్‌ ఉన్న విజయ్‌దేవరకొండ వంటి వారు కూడా తమ తమ్ముడిని హీరోగా పరిచయం చేయాలని భావిస్తున్నారు. మరి అలాంటిది తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 200లకు పైగా చిత్రాలలో, మరీ ముఖ్యంగా 90లలో హీరోయిన్‌గా ఓ ఊపు ఊపిన సుమలతకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక ఆమె శ్రీవారు కన్నడనాట రెబెల్‌స్టార్‌గా ఎంతో పేరు తెచ్చుకుని, రాజకీయ నాయకునిగా కూడా తన సత్తా చాటాడు. వీరిద్దరి ముద్దుల కుమారుడు అభిషేక్‌ అంబరీష్‌ త్వరలో హీరోగా తెరంగేట్రం చేయడానికి సర్వం సిద్దం అయింది. 

Advertisement
CJ Advs

అభిషేక్‌ చూడటానికి మంచి ఒడ్డుపొడవుతో హీరోలా ఉన్నాడు. తన తల్లిదండ్రులు, స్నేహితుల ప్రోత్సాహంతో ఆయన నటన, కిక్‌బాక్సింగ్‌, మార్షల్‌ ఆర్ట్స్‌ వంటి వాటిల్లో థాయ్‌లాండ్‌లో శిక్షణ తీసుకున్నాడు. ఇక ఈయన హీరోగా పరిచయం అయ్యే చిత్రానికి నాగ్‌శేఖర్‌ దర్శకత్వం వహిస్తుండగా టైటిల్‌ని 'అమర్‌' అని ఫిక్స్‌ చేశారు. 

ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. మిస్‌ ఇండియా ఫైనలిస్ట్‌ తాన్యాహోప్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌. ఈచిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది. కాగా ఈ రోజు అంబరీష్‌ బర్త్‌డే. ఈ సందర్భంగా తన కుమారుడు హీరోగా పరిచయం కావడం అంబరీష్‌కి ఆయన కుమారుడు ఇచ్చే బర్త్‌డే గిఫ్ట్‌ అనే చెప్పాలి...! 

Sumalatha's Son Abhishek Ready to Cine Entry:

Sumalatha and Ambareesh Son Movie Name is Aamar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs