Advertisement
Google Ads BL

సీమంతపు వేడుకల్లో ఎన్టీఆర్ వైఫ్!


జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా 'అరవింద సమేత - వీర రాఘవ' షూటింగ్ తో బాగా బిజీగా వున్నాడు. గత ఏడాది 'జై లవ కుశ' సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకోవడమే కాదు... బిగ్ బాస్ సీజన్ వన్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించి మంచి క్రేజ్ సంపాదించాడు. డబ్బుకి డబ్బు, క్రేజుకి క్రేజు బిగ్ బాస్ తో ఎన్టీఆర్ సొంతమయ్యాయి. అలాగే ఈ ఏడాది త్రివిక్రమ్ అరవింద సమేతని దసరా నాటికి.. పూర్తి చేసి విడుదల చేసేసి.. తర్వాత రాజమౌళితో కలిసి చరణ్ తో పాటుగా భారీ మల్టీస్టారర్ కి రెడీ అవ్వబోతున్నారు ఎన్టీఆర్. మరి జక్కన్నతో సినిమా కోసం తెగ వెయిట్ చేస్తున్న ఎన్టీఆర్ కి ఈ ఏడాది ఆ కోరిక తీరిపోతుండడంతో.. ఫుల్ ఖుషీగా వున్నాడు. రీల్ లైఫ్ లోనే ఎన్టీఆర్ హ్యాపీగా లేడు.. రియల్ లైఫ్ లో ఎన్టీఆర్ ఫుల్ హ్యాపీగా వున్నాడు. ఎందుకంటే ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మి ప్రణతి సెకండ్ టైం ప్రెగ్నెంట్.

Advertisement
CJ Advs

ఎన్టీఆర్ కి లక్ష్మి ప్రణతితో పెళ్లి జరిగిన తరువాత.. అభయ్ రామ్ పుట్టాడు. అభయ్ రామ్ తర్వాత మళ్ళీ ఇన్ని రోజులకి ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మి ప్రణతి సెకండ్ టైం ప్రెగ్నెంట్ అయ్యింది. ఇక లక్ష్మి ప్రణతి ప్రెగ్నెంట్ కావడంతో ఎన్టీఆర్ ఫుల్ ఖుషీగా వున్నాడు. మరి చాలా త్వరలోనే లక్ష్మి ప్రణతి డెలివరీ జరిగి ఒక పాపో.. బాబో ఎన్టీఆర్ చేతుల్లోకి వచ్చేస్తారు. ఇక ప్రస్తుతం లక్ష్మి ప్రణతి శ్రీమంతం వేడుకలు ఒక రేంజ్ లో జరిగాయి. కొద్దిమంది అతిధుల సమక్షంలో లక్ష్మి ప్రణతి శ్రీమంతం వేడుకలు ఘనంగా జరిగాయనడానికి సాక్ష్యం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ప్రణతి శ్రీమంతం వేడుకల ఫొటోస్. మరి ఆ ఫొటోస్ లో ఎన్టీఆర్ ఎక్కడా కనబడలేదుగాని.. తన భార్య ప్రణతి శ్రీమంతం వేడుకల్ని మాత్రం ఎన్టీఆర్ బాగా ఎంజాయ్ చేసినట్లుగా తెలుస్తుంది.

ఇక ఈ వేడుకల్లో లక్ష్మి ప్రణతి స్నేహితుల హడావుడి మాములుగా లేదంటే  నమ్మాలి. ఇక అతి త్వరలోనే.. బుల్లి బాబు అయినా.. బుడ్డి పాపనైనా ఎత్తుకోవాలనే ఆరాటంలో ఎన్టీఆర్ ఉన్నాడు.

JR NTR With Seemantham Celebration:

JR NTR With Lakshmi Pranathi Spotted With Baby Bump
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs