'బాహుబలి' తర్వాత అదే రేంజ్‌లో దేశంలోని అన్ని భాషల్లో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో దేశంలోనే తొట్టతొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా కొణిదెల బేనర్‌లో రామ్‌చరణ్ నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'సై..రా..నరసింహారెడ్డి'. ఈ చిత్రాన్ని కూడా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు దేశ విదేశీ భాషల్లో విడుదల చేయనున్నందున ఇందులోని నటీనటులను, సాంకేతిక నిపుణులను కూడా ఎంతో జాగ్రత్తగా ఎంచుకుంటూ ఉన్నారు.
ఇప్పటికే అమితాబ్‌బచ్చన్, విజయ్‌సేతుపతి, నయనతార, ప్రియాంకాచోప్రా, కిచ్చా సుదీప్‌లతో పాటు పలు భాషా నటులను ఎంచుకున్నారు. ఇక ఈ చిత్రంలో నరసింహారెడ్డి ప్రాణాల కోసం తాను ప్రాణత్యాగం చేసే పాత్రలో తమన్నాని తీసుకున్నారు. 'బాహుబలి'లో కూడా అవంతిక పాత్ర ద్వారా తమన్నా పోరాట యోధురాలిగా తన సత్తా చాటింది. దీంతో ఈమెని తీసుకోవడం బాలీవుడ్‌తో పాటు దక్షిణాది భాషలకి కూడా కలిసొస్తుందని భావిస్తున్నారు.
ఇక ఇందులో వీరనారిగా కనిపించనున్న తమన్నా ప్రస్తుతం ఈ చిత్రం కోసం భరతనాట్యం నేర్చుకుంటోందని సమాచారం. ఓవైపు వీరనారిగా, మరోవైపు భరతనాట్యం కళాకారిణిగా ఆమె పాత్ర సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని భావిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.