Advertisement
Google Ads BL

గవర్నర్‌ దంపతులకు 'మహానటి' పిలుపు!


సావిత్రి బయోపిక్‌గా రూపొందిన 'మహానటి' చిత్రాన్ని విడుదలైన రోజే కేటీఆర్‌ చూసి ప్రశంసల వర్షం కురిపించాడు. ఆ వెంటనే లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ్‌ ఆ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేశాడు. ఇక సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, ఇతర రంగాల ప్రముఖుల నుంచి కూడా వరుసగా ప్రశంసల పర్వం కొనసాగుతూనే ఉంది. చిరంజీవి, అల్లుఅరవింద్‌ వంటి వారు ఈ యూనిట్‌ని ఆహ్వానించి మరీ వారికి సన్మానం చేసి అభినందించారు. 

Advertisement
CJ Advs

ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం ఈ యూనిట్‌ని ఆహ్వానించి దీనికి పన్ను మినహాయింపు ఇస్తానని చెప్పి చిత్ర యూనిట్‌ని, నటీనటులను, నిర్మాతలను సన్మానించారు. తాజాగా ఈ చిత్ర దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, నిర్మాతలు అశ్వనీదత్‌, ప్రియాంకాదత్‌లు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ దంపతులను ప్రత్యేకంగా కలిసి వారికి చిత్ర నిర్మాణ విశేషాలను తెలియజేశారు. 

ఈ సందర్భంగా వీరు గవర్నర్‌ దంపతులను ఈ చిత్రం చూసేందుకు ఆహ్వానించారు. దానికి గవర్నర్‌ దంపతులు సుముఖత వ్యక్తం చేశారు. త్వరలో నరసింహన్‌ దంపతులకు ఈ చిత్రం స్పెషల్‌ షోను ప్రదర్శించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. 

Mahanati Special Invitation to Governor:

Mahanati Movie Director Ashwin Nag Producers Ashwini Dutt & Priyanka Dutt Met Governor
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs