నాగార్జున - రామ్ గోపాల్ వర్మ కలయికలో తెరకెక్కిన ఆఫీసర్ జూన్ 1 న విడుదలకు సిద్దమవుతుంది. వచ్చే శుక్రవారం విడుదల కాబోయే ఆఫీసర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గత రాత్రి ఘనంగా నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నాగ్ ఫ్యామిలీ మాత్రమే నిలిచింది. నాగార్జున భార్య తన కొడుకులతో సహా హాజరయ్యాడు. నాగ చైతన్య, అఖిల్, అమల, సుమంత్ ఇలా అక్కినేని ఫ్యామిలీ మెంబెర్స్ మాత్రమే హాజరయ్యారు. ఇక రామ్ గోపాల్ వర్మ, కీరవాణి, ఆఫీసర్ హీరోయిన్ మైరా సరీన్ కూడా హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ కి కేవలం నాగ్ ఫ్యామిలీ మాత్రమే హాజరయ్యారు అంటే... రామ్ గోపాల్ వర్మ విషయంలో ఇండస్ట్రీ మొత్తం అంటే ముఖ్యంగా మెగా ఫ్యామిలీ మొత్తం కక్ష గట్టిందా!. అందుకే మొదటి నుండి ఆఫీసర్ సినిమాకి సుకుమార్ వంటి డైరెక్టర్స్ వస్తారని చెప్పినా చివరికి ఈ ఈవెంట్ కి ఎవరు హాజరవలేదు.
రామ్ గోపాల్ వర్మ కి టాలీవుడ్ నుండి ఇక సపోర్ట్ ఉండదని... ఆఫీసర్ సినిమానే ఆయనకు టాలీవుడ్ లో చివరి చిత్రంగా మిగిలిపోతుందని.. సోషల్ మీడియాలో ఎప్పటినుండో కామెంట్స్ వినబడుతున్నాయి. రామ్ గోపాల్ వర్మ.. శ్రీ రెడ్డి ని ప్రేరేపించి.. పవన్ కళ్యాణ్ ని కెలికాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కి మీడియా ముఖంగా సారీ చెప్పినా రామ్ గోపాల్ వర్మ ని ఇండస్ట్రీ పెద్దలు చెడామడా తిట్టారు. ఒకానొక సమయంలో రామ్ గోపాల్ వర్మ ని బ్యాన్ చేద్దామని కూడా... ఇండస్ట్రీ చాలా పెద్దది... ఇది మన అందరిదీ అంటూ వర్మని వదిలిపెట్టారు. అయితే రామ్ గోపాల్ వర్మ మీద ఇంత జరుగుతున్నా నాగార్జున మాత్రం కిక్కురుమనలేదు. ఇక నిన్న మొన్నటివరకు రామ్ గోపాల్ వర్మ ట్రాక్ రికార్డుతో.. ఆఫీసర్ బిజినెస్ కూడా సరిగ్గా జరగలేదు అనే టాక్ ఉంది.
ఇక ఇప్పుడు ఆఫీసర్ సినిమా మీద ఓ అనుకున్నంత క్రేజ్ కూడా లేదు. అలాగే నాగార్జున ఆఫీసర్ కథను నమ్మి వర్మతో సినిమా చేసాడు. రామ్ గోపాల్ వర్మ గత సినిమాలు చూసిన ఎవ్వరు అతనికి అవకాశమే ఇవ్వరు. కానీ నాగ్ అలా చెయ్యకుండా వర్మకి అవకాశం ఇచ్చాడు. అంటే ఆఫీసర్ సినిమా హిట్ అవుతుంది అని నాగ్ నమ్ముతున్నాడు. అంతేలే తెలిసి తెలిసి తనకున్న క్రేజ్ ని ఎవరూ పాడు చేసుకోరు కదా..! ఏది ఏమైనా మెగా ఎఫెక్ట్ మాత్రం ఈ ఆఫీసర్ పై గట్టిగా పడుతున్నది అనేది మాత్రం నిజం.