మనదేశ నాయకులు అసలు విషయాలను మభ్యపెట్టేందుకు, ఓటు రాజకీయాల కోసం కులాలు, మతాలను వాడుకుంటూ ఉంటారు. ఇక అగ్రవర్ణాలు, దళితులు, వెనుకబడ్డ వర్గాలు, పురుషులు, స్త్రీలు అనే బేధాలను కూడా తెరపైకి తెచ్చి ఓట్ల కోసం నీచమైన పనులు చేసే నాయకులకు మనకి కొదువ లేదు. నిజానికి లోకంలో కేవలం రెండు కులాలు, వర్గాలు మాత్రమే ఉన్నాయి. అవి ధనిక, పేద మాత్రమే. కానీ ఈ విషయాన్ని మన నాయకులు పట్టించుకోవడం లేదు. పేదలకు రోగాలు రావని ఏమైనా ఉందా? కేవలం ధనికులకే పెద్ద రోగాలు రావాలనే నిబంధన ఏమైనా ఉందా? లేక మహిళలకు మాత్రమే రోగాలు వస్తాయి. మగవారికి రావు. పేదవారికి రోగాలు రావు. కేవలం దళితులకు మాత్రమే సమస్యలు వస్తాయా? వంటి అనుమానాలు రావడం సహజం.
కులాలు, మతాలు, లింగ బేధాలు లేకుండా కేవలం సమాజంలో ధనిక, పేద అనే తేడా మాత్రమే ఉంది. బహుశా ఈ విశాల దృక్పథం పవన్‌కళ్యాణ్‌లోనైనా ఉంటుందని ఆశించే వారికి ఆయన చేసిన ఓ వ్యాఖ్య ఆయన కూడా అందరి నాయకులు కోవలో ఆ తానులో గుడ్డేనని అనిపించకమానదు. తాను అధికారంలోకి వస్తే మహిళలందరికీ ఉచితంగా వైద్యసేవలు అందిస్తానని ఆయన ప్రకటించారు. మరి రోగాలు ఆడవారికి మాత్రమే వస్తాయా? అనే చర్చ జరుగుతోంది. ఎంతైనా కొంతలో కొంత జగన్ విషయం ఫర్వాలేదు. ఆయన 1000 రూపాయలు దాటిని ఆరోగ్య సేవలన్నింటినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తానని చెప్పాడే గానీ ఇలా వివక్ష వ్యాఖ్యలు చేయలేదు.
ఇక పవన్ మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత వైద్యం అనేది ఒక ప్రధానమైన విషయం అని తేలిపోయింది. ఇక ఆగష్టు15న స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ఆయన జనసేన పూర్తి మేనిఫెస్టోలు ప్రకటిస్తానని చెప్పాడు. మరి ఇందులో ఎన్ని వింతలు ఉండనున్నాయో అనేది వేచిచూడాల్సిందే.