Advertisement
Google Ads BL

'అజ్ఞాతవాసి' లాస్ గురించి త్రివిక్రమ్ క్లారిటీ!


త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ప్రతి చిత్రం ఎంతో పొయిటిక్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. 'నువ్వే నువ్వే' నుంచి 'అతడు, అత్తారింటికి దారేది, సన్నాఫ్‌ సత్యమూర్తి, జులాయి, జల్సా, అ..ఆ' వరకు అన్ని చిత్రాలు సకుటుంబంగా చూసేలా ఉంటాయి. ఆయనకంటూ తెలుగు సినీ పరిశ్రమలో ఓ ప్రత్యేకగుర్తింపు ఉంది. దర్శకుడు కాకముందు కూడా 'నువ్వునాకు నచ్చావ్‌, మల్లీశ్వరి, మన్మథుడు, స్వయంవరం' ఇలా ఆయన మాటల మాంత్రికునిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక మహేష్‌బాబు నటించిన 'ఖలేజా' చిత్రం కమర్షియల్‌గా హిట్‌ కాకపోయినా కూడా సీన్‌టు సీన్‌ బాగానే ఉంటుంది. దాంతో ఈ చిత్రం శాటిలైట్‌లో వచ్చినప్పుడు ప్రేక్షకులు బాగానే చూస్తూ ఉంటారు. కానీ 'అజ్ఞాతవాసి' చిత్రం మాత్రం త్రివిక్రమ్‌ పేరును అదఃపాతాళంలో పడేలా చేసింది. అసలు ఈ చిత్రాన్ని తీసింది త్రివిక్రమేనా అనే అనుమానం వచ్చేంతలా ఇది ఉండటం గమనార్హం. 

Advertisement
CJ Advs

తాజాగా ఈ చిత్రం గురించి త్రివిక్రమ్‌ మాట్లాడుతూ, ఓ రాజు.. ఓ రాజ్యం అంటూ సింపుల్‌గా ప్రజలకు చేరువయ్యేలా చెప్పాల్సిన కథను నేను బిజినెస్‌ పేజీలో మాత్రమే వచ్చే, అర్ధమయ్యే విధంగా కార్పొరేట్‌ స్టైల్‌లో చెప్పడం వల్లనే ప్రేక్షకులు తిరస్కరించారు. దాంతో ఎమోషన్స్‌ కూడా దారి తప్పాయి. దాంతో జనం ఆ చిత్రాన్ని తీసి పక్కన పడేశారు. ఈ చిత్రం నాకు గుణపాఠంగా మిగులుతుంది. ఈ చిత్రం డిజప్పాయింట్‌ చేసి నాకు జ్ఞానోదయం చేసిందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ చిత్రం 90 కోట్ల బిజినెస్‌ చేస్తే 60కోట్లు రికవరీ అయ్యాయని, దాంతో నేను, పవన్‌కళ్యాణ్‌, నిర్మాత రాధాకృష్ణలు కలిసి బయ్యర్లకు 25కోట్లు తిరిగి ఇచ్చామని, మన వల్ల ఎవ్వరూ నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. 

ఇక నేను పవన్‌కి పొలిటికల్‌ స్పీచ్‌లు రాసి ఇస్తాననే విషయంలో నిజం లేదు. స్వయంగా ఆయన బాగా రాసుకోగలడు. ఓ పుస్తకాన్ని చదివినా కూడా ఆయన వెంటనే దాని అభిప్రాయాన్ని కాగితంపై రాసుకుంటారు. ఇక నాకు రాజకీయాలంటే పడవు అని చెబుతూ, 'అజ్ఞాతవాసి' కూడా 'ఖలేజా'లా టివిలలో ఆదరణ పొందతుందని చెప్పాడు. కానీ ఈ విషయంలో ఆయన మాటలు తప్పు. 'ఖలేజా' కనీసం సీన్‌టు సీన్‌ అయినా బాగుంది. కానీ 'అజ్ఞాతవాసి'లో అది కూడా లేదనేది వాస్తవం. 

Pawan, Trivikram Justice to Agnathavasi Buyers:

Trivikram About Agnathavasi Adjustments
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs