ప్రస్తుతం 'భరత్ అనే నేను' ఊపులో సూపర్‌స్టార్ మహేష్‌బాబు మంచి హుషారు మీదున్నాడు. 'బ్రహ్మూెత్సవం, స్పైడర్' వంటి డిజాస్టర్స్ ఆయనకు షాక్ ఇచ్చాయి. కానీ వాటన్నింటికి 'భరత్ అనే నేను' చిత్రం సమాధానం చెబుతోంది. ఇక ఈయన ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి విదేశాలలో వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. వచ్చే నెల 9వ తేదీన ఆయన హైదరాబాద్‌కి వస్తాడు. వచ్చిన వెంటనే ప్రస్తుతం ప్రీప్రొడక్షన్స్‌తో సహా అన్ని పూర్తి చేసుకుంటున్న తన 25వ ప్రతిష్టాత్మక చిత్రంగా దిల్‌రాజు, అశ్వనీదత్‌ల భాగస్వామ్యంలో వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం షూటింగ్‌లో జాయిన్ అవుతాడు. ఈ చిత్రం ఎక్కువ భాగం అమెరికాలో షూటింగ్ జరగనుండగా, మహేష్ ఈ చిత్రం కోసం అమెరికాలో చాలా రోజులే గడపనున్నాడని సమాచారం. ఇక ఇందులో పూజాహెగ్డే, అల్లరినరేష్ వంటి వారు నటిస్తుండగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్ కొత్త అవతారంలో మీసాలు, గెడ్డాలతో కనిపిస్తాడని తెలుస్తోంది.
ఇక గతంలో మహేష్‌కి 'బ్రహ్మూెత్సవం' తర్వాత పివిపికి ఓ చిత్రం చేయాలనే అగ్రిమెంట్ ఉంది. దాంతో తన 25వ చిత్రంలో పివిపిని కూడా పార్ట్‌నర్‌గా చేసుకునే అవకాశాలున్నాయి. దీనితో పాటు ఈయన తదుపరి చిత్రంగా సుకుమార్ మరో కథను సిద్దం చేస్తున్నాడు. ఈ చిత్రం ప్రీప్రొడక్షన్స్ పనులు కూడా వేగంగా జరిగితే మైత్రిమూవీమేకర్స్‌లోనే 'శ్రీమంతుడు' తర్వాత సుకుమార్ దర్శకత్వంలో చేయబోయే ఈ చిత్రాన్ని కూడా వెంటనే ప్రారంభించాలనే ఆలోచనలో మహేష్ ఉన్నాడు. ఇక విషయానికి వస్తే మహేష్ తన ట్విట్టర్ ఫాలోయర్స్‌ను పెంచాడు. మహేష్ ట్విట్టర్ అకౌంట్ ఖాతాను ఇప్పటి వరకు 65లక్షల మంది ఫాలో అవుతుండగా, ఆయన మాత్రం గల్లాజయదేవ్‌నే ఫాలో అవుతున్నాడు.
ఇక 'భరత్ అనే నేను' తర్వాత ఆయన కొరటాల శివను కూడా ఫాలో అవుతూ వస్తున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరి సంఖ్య కాస్తా 8కి చేరింది. మహేష్ కొత్తగా దర్శకదిగ్గజం రాజమౌళి, భారతరత్న సచిన్ టెండూల్కర్, మహేంద్రసింగ్ ధోని, క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్, రచయిత టోనీ రాబిన్స్‌ని కూడా ఫాలో అవుతున్నాడు. మరి ప్రిన్స్‌లో వచ్చిన ఈ మార్పు దేనికి సంకేతమో చూడాల్సివుంది..!