రజినీకాంత్ సినిమాలు వస్తున్నాయంటే.. చాలు ప్రేక్షకుల్లో పిచ్చ క్రేజ్ ఉంటుంది. కానీ ఈ మధ్యన ఆయన సినిమాలు అనుకున్న డేట్ కి విడుదల కాకుండా వాయిదాల మీద వాయిదాలు పడుతూ రావడంతో.. ఆ సినిమాల మీద ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ తగ్గుతుందనిపిస్తుంది. రజినీకాంత్ - శంకర్ ల కాంబోలో తెరకెక్కిన 2.ఓ ఈ ఏడాది ప్రథమార్ధంలో విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి. మరోపక్క రంజిత్ పా డైరెక్షన్ లో ధనుష్ నిర్మించిన కాలా సినిమాపై ప్రస్తుతం పెద్దగా క్రేజ్ లేదనిపిస్తుంది.
మరి కబాలి వంటి ప్లాప్ తర్వాత రంజిత్ పా చేసిన సినిమా వలన సూపర్ స్టార్ రజినీకాంత్ కాలాకి క్రేజ్ రావడం లేదో తెలియదు గాని... ఈ సినిమా మీద హైప్ పెంచడానికి ధనుష్ అండ్ కో చాలా ప్రయత్నాలు చేస్తుంది. మొన్నటికి మొన్న చెన్నై లో గ్రాండ్ గా కాలా సినిమా ఆడియో లాంచ్ నిర్వహిస్తే... ఇప్పుడు హైదరాబాద్ లో గ్రాండ్ గా కాలా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు. ఇక ఈ సినిమాకి తెలుగు హక్కులు నిర్మాత ధనుష్ 45 కోట్ల దాకా ఆశిస్తే ఫైనల్ గా 30 దగ్గర క్లోజ్ అయ్యిందని ట్రేడ్ టాక్. అయితే ఇప్పుడు రజినీకాంత్ - బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషి జంటగా నటించిన కాలా సినిమా కథ ఇదేనంటూ ఒక కథ నెట్ లో చక్కర్లు కొడుతోంది.
రజినీకాంత్ కాలా సినిమా రజనీకాంత్, నానా పాటేకర్ ప్రాణ స్నేహితులు. కానీ సమాజం పట్ల ఇద్దరి దృక్పధం వేరుగా ఉంటుంది. రజని పేదల కోసం మాఫియా డాన్ గా ఎదిగితే నానా పాటేకర్ ఎత్తుకు కుయుక్తులు చేసి మినిస్టర్ రేంజ్ కు చేరుకుంటాడు. కానీ నానా వల్లే రజని జీవితం అల్లకల్లోలం అయ్యిందనే విషయం కాలా చివరి దాకా గుర్తించడు ఈ ఇద్దరి మధ్య ధారవి అనే స్లమ్ ఏరియా నేపధ్యంగా కథనే కాలా అని టాక్. అంతే కాదు నానా పాటేకర్ అగ్ర వర్గాల ప్రతినిధిగా కనిపిస్తే రజనీకాంత్ లేని వర్గానికి చెందినవాడుగా కనిపిస్తాడట. ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో వచ్చిందని టాక్. మరి ఈ కథని చూస్తుంటే దర్శకుడు రంజిత్ పా కబాలి 2 తీస్తున్నాడా అనిపిస్తుంది. చూద్దాం కాలా.. కబాలి 2 అవుతుందా.. లేదా అనేది... జూన్ 7 గాని తెలియదు.