పవన్‌కళ్యాణ్ 'కొమరం పులి' హీరోయిన్ నికిషా పటేల్ తాజాగా తాను ప్రభుదేవాతో నటించడం ఏం ఖర్మ? ఏకంగా ఆయన్ను వివాహం చేసుకుంటానని, తన కుటుంబంతో ఆయనకు కూడా మంచి అనుబంధం ఉందని సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా దీనిపై వివరణ ఇస్తూ తనను ప్రతి చోటా మీడియా వారు మీకు ఏ హీరో అంటే ఇష్టం? అని ప్రశ్నిస్తూ ఉండటంతో విసుగు చెంది అలా చెప్పానని, నిజానికి ప్రభుదేవాతో తనకేమీ లేదని తేల్చిచెప్పింది. చిన్న మాట అంటే దానిని పట్టుకుని రాద్దాంతం చేస్తున్నారని, ఆ వార్తలకు ఇక ముగింపు పలకాలన్నదే తన అభిమతమని తెలిపింది.
ఇక ఈమె తన ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడుతూ, సినిమాలలోకి రాకముందు నాకు ఓ లవ్ ఎఫైర్ ఉండేది. ఇంట్లోని పెద్దల అంగీకారంతో వివాహం కూడా చేసుకోవాలని భావించాం. కానీ నేను సినిమాలలోకి వెళ్లాలనే ఉద్దేశ్యంతో ఉండటంతో నా బాయ్ ఫ్రెండ్‌కి సినిమాలలోకి వెళ్లడం ఇష్టం లేదు. దాంతో ఆయన సినిమాలలోకి వెళ్లితే నిన్ను పెళ్లి చేసుకోనని ఖరాఖండీగా చెప్పాడు. కానీ నాకు మాత్రం నాడు పెళ్లి కంటే సినిమాలే ముఖ్యం అనిపించాయి.
అయినా సినిమాలలో కూడా పెద్దగా సక్సెస్ రాకపోవడం నా దురదృష్టం. అయినా నాకంటూ ఒక్క హిట్ చిత్రం వస్తే బిజీ అవుతాననే నమ్మకం ఉంది. నటిగా మారిన తర్వాత కూడా ప్రేమ, పెళ్లి వంటి ఆలోచనలు వచ్చేవి. కానీ ఇప్పుడు అలాంటి ఆలోచనలకు చోటు లేదు. నాకు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే ఇంట్లో పెద్దల అనుమతితో వెంటనే వివాహం చేసుకుంటాను గానీ ఏ విషయం దాచుకోను అని చెప్పుకొచ్చింది.