గతంలో కేవలం అభిమానుల కోసమే చిత్రాలు చేస్తానని, అభిమానులకు నచ్చే చిత్రాలలో మాత్రమే నటిస్తానని చెప్పిన రామ్‌చరణ్ 'ధృవ' ఇక మరీ ముఖ్యంగా 'రంగస్థలం' చిత్రం తర్వాత మాత్రం తాను నటునిగా మంచి పాత్రలను, వైవిధ్యభరితమైన పాత్రలే చేస్తానని, కేవలం ఫ్యాన్స్‌ని అలరించే చిత్రాలు చేయనని చెప్పాడు. మరోవైపు మహేష్‌బాబు తనకు ప్రయోగాలు చేసి చేసి విసుగొచ్చిందని, ఇక నుంచి అభిమానుల కోసమే చిత్రాలు తీస్తానన్నాడు. మరి 'భరత్ అనే నేను' కూడా ఓ ప్రయోగమే కదా...! ఈ విషయంలో పలు చర్చలు సాగుతున్నాయి.
ఇక తాజాగా రామ్‌చరణ్ మాట్లాడుతూ.. ఇక నుంచి నేను నటించే చిత్రాలలో, నిర్మించే చిత్రాలలో కలెక్షన్ల నెంబర్లను వేయనని హుందాగా చెప్పాడు. కేవలం 'రంగస్థలం, భరత్ అనే నేను, నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా' వంటి చిత్రాల కలెక్షన్ల నెంబర్లతో వచ్చిన వివాదాలే దీనికి కారణమని చెప్పాలి. ఎంతైనా రామ్‌చరణ్ ఎంతో ఉన్నతంగా ఈ నిర్ణయం తీసుకుని పదిమందికి ఆదర్శంగా నిలబడ్డాడు. స్టార్స్ అందరి మద్య స్నేహపూరిత వాతావరణం ఉందని, దీనివల్ల ఫ్యాన్స్ మద్య గొడవలు, విబేధాలు తలెత్తకుండానే చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పవచ్చు. కానీ దీనిని కూడా కొందరు వివాదమయం చేస్తున్నారు.
రామ్‌చరణ్.. మహేష్‌కి కౌంటర్ వేశాడని, ఈ వ్యాఖ్యలు బన్నీని ఉద్దేశించినవేనని మరలా అభిమానులు రచ్చలు చేసుకుంటున్నారు. అభిమాన హీరోనే గొడవలు, విభేదాలు వద్దని చెబుతుంటే ఇలా మంచి మాటలను కూడా మసిపూసి వివాదాలు రాజేయడం సరైన పద్దతి కాదని అభిమానులు తెలుసుకోవాల్సివుంది....! ఇక మంచి పాత్రలువస్తే మరలా బాలీవుడ్‌లో నటిస్తానని, రాజకుమార్ హిరాణి, విశాల్ భరద్వాజ్ వంటి అద్భుత దర్శకుల చిత్రాలలో అవకాశం వస్తే తాను బాలీవుడ్‌లో చేయడానికి రెడీగా ఉన్నానని రామ్‌చరణ్ ప్రకటించడం విశేషం.