సాధారణంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తన కెరీర్‌లో ఎక్కువగా దేవిశ్రీప్రసాద్‌తో పనిచేశాడు. కానీ కొన్ని చిత్రాలకు మణిశర్మ, ఆ తర్వాత మిక్కీ జె మేయర్, అనిరుధ్ వంటి వారితో పనిచేశాడు. కానీ అనిరుధ్‌తో ఆయన చేసిన 'అజ్ఞాతవాసి' సంగీత పరంగా కూడా బాగా దెబ్బకొట్టింది. దాంతో ఆయన తన తదుపరి చిత్రంగా ఎన్టీఆర్ హీరోగా హారిక అండ్ హాసిని వంటి బేనర్‌లో రాధాకృష్ణ నిర్మాతగా 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రం చేస్తున్నాడు. ఇందులో 'డిజె' భామ పూజాహెగ్డే నటిస్తోంది. ఇక దీనికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్, సెకండ్‌లుక్‌లతో పాటు మోషన్ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు.
'తొలిప్రేమ'తో క్లాస్ మ్యూజిక్‌ని కూడా అందించగలనని నిరూపించుకున్న తమన్ ఈ చిత్రం మోషన్ పోస్టర్‌లో కూడా తన సత్తా చూపించాడు. ఇక ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ని పూర్తి చేసుకుని, రెండో షూడ్యూల్‌ని జరుపుకుంటోంది. ఇటీవలే త్రివిక్రమ్, ఎన్టీఆర్, సిరివెన్నెలలతో ఫొటో దిగిన తమన్ మరోసారి ఈ చిత్రం మ్యూజికల్ సిట్టింగ్స్ సందర్భంగా కలుసుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి, త్రివిక్రమ్, ఎన్టీఆర్‌లతో కలుసుకుని మరో ఫొటో దిగాడు. సంగీత సాహిత్యాల అవుట్‌పుట్ గురించి వీరు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోని తమన్ ట్వీట్ చేశాడు.
ఏ సంగీత దర్శకునికైనా ఇదే డ్రీం టీం అని కామెంట్ చేశాడు. ఇక ఈ చిత్రాన్ని దసరా లేదా దీపావళి కానుకగా విడుదల చేసే అవకాశాలున్నాయి. ఇక తమన్ ప్రస్తుతం దిల్‌రాజు బేనర్‌లో రామ్-త్రినాథ్ నక్కినరావు కాంబినేషన్‌లో రూపొందుతున్న 'హలో గురూ ప్రేమకోసమే' చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నాడు. మొదట ఈ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్‌ని అనుకున్నా వీలుకాలేదు. దాంతో తమన్‌తో రీప్లేస్ చేశారు. ప్రస్తుతం మరలా దేవిశ్రీ అందుబాటులోకి రావడంతో తమన్‌ని ఈ చిత్రం నుంచి తప్పించారని సమాచారం.