Advertisement
Google Ads BL

త్రివిక్రమ్ ని గట్టిగా టార్గెట్ చేసింది..!


తెలుగులో అందం, అభినయం ఉన్నా కూడా పెద్దగా చాన్స్‌లు దక్కించుకోలేకపోయిన హీరోయిన్‌ పూనమ్‌కౌర్‌. కాగా ఈమె కత్తి మహేష్‌, పవన్‌ ఫ్యాన్స్‌కి మద్య జరిగిన వార్‌లో కత్తి మహేష్‌ని విమర్శించింది. ఆ తర్వాత కత్తి మహేష్‌.. పూనమ్‌కౌర్‌ పవన్‌ నామ గోత్రాలతో పూజలు చేయించిన విషయం, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, పవన్‌లు 'జల్సా' చిత్రంలో పూనమ్‌కౌర్‌కి అవకాశం ఇస్తామని చెప్పి చివరి క్షణంలో పార్వతీ మెల్టన్‌కి అవకాశం ఇవ్వడం, ఒకానొక సమయంలో పూనమ్‌ విరక్తితో ఆత్మహత్యాప్రయత్నం చేసే వరకు వెళ్లిందని వార్తలు వచ్చాయి.

Advertisement
CJ Advs

కానీ పూనమ్‌ తాజాగా చేసిన ట్వీట్స్‌ చూస్తుంటే ఆమె గోల్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ అని అర్ధమవుతోంది. ఈమె ట్వీట్‌ చేస్తూ 'జల్సాలు చూపిస్తూ అజ్ఞాతవాసంలో వేస్తాడు జాగ్రత్త. నమ్మకద్రోహి' అని ఆమె చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. మరోవైపు ఈ ట్వీట్‌లో 'జల్సా, అజ్ఞాతవాసి' వంటి సినిమా టైటిల్స్‌ని వాడటం ద్వారా ఆమె త్రివిక్రమ్‌ పేరును ఇన్‌డైరెక్ట్‌గా చెప్పినట్లేనని భావిస్తున్నారు. ఇక ఈయనకు ఎన్నారై అమ్మాలంటే ఇష్టం. వారికి తన చిత్రాలలో అవకాశాలు ఇస్తాడు. నాకు మాత్రం సక్సెస్‌లు లేవని కుంటిసాకులు చెబుతాడు. మరి ఆ ఎన్నారై హీరోయిన్లకు మాత్రం హిట్స్‌ ఉన్నాయా? ఎందుకంటే ఎన్నారైలు అయినా ఆయన చెప్పినవన్నీ చేస్తారని చురకలు అంటించింది.

ఇక నాడు 'జల్సా' చిత్రం సమయంలో పార్వతిమెల్టన్‌ స్థానంలో పూనమ్‌కౌర్‌ని తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఇటీవల వచ్చిన 'అజ్ఞాతవాసి'లో కూడా ఎన్నారై అయిన అను ఇమ్మాన్యుయేల్‌కి త్రివిక్రమ్‌ చాన్స్‌ ఇచ్చాడు. మొత్తానికి ఈ విషయంలో పూనమ్‌కౌర్‌ త్రివిక్రమ్‌ని టార్గెట్‌ చేయడం ప్రస్తుతం సంచలనాలను సృష్టిస్తోంది.

Is Parvathi Melton, Poonam Talking About?:

Poonam Attacks Trivikram NRI Heroine!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs