'బాహుబలి' తర్వాత 'భాగమతి'తో కూడా మంచి హిట్‌కొట్టి లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేయడంలో తన సత్తాని స్వీటీ అనుష్క చాటింది. ఆమె నటించిన 'భాగమతి' చిత్రం టాలీవుడ్‌లో ఈ ఏడాది వచ్చిన నిజమైన నికార్సయిన హిట్‌ని సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. కాగా ఇప్పుడు ఆమె ప్రస్తుతం గౌతమ్‌మీనన్‌తో ఓ చిత్రం చేసేందుకు అంగీకరించింది.
ఇక ఈమె తాజాగా తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందనున్న మరో లేడీ ఓరియటెంటెడ్ చిత్రానికి కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందట. ఈ చిత్రానికి రచయితగా, దర్శకునిగా తెలుగు వారికి సుపరిచితుడు, మంచు విష్ణు హీరోగా 'వస్తాడు నారాజు' చిత్రం తీసిన హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించనున్నాడు. ఇక 'సఖి, చెలి' వంటి పలు డబ్బింగ్ చిత్రాలతో ఆకట్టుకుని ఎట్టకేలకు ఇన్నేళ్ల తన కెరీర్‌లో మొదటి సారి తెలుగులో 'సవ్యసాచి' చిత్రంలో విలన్‌గా నటిస్తున్న మాధవన్‌కి ఈ చిత్రంలో అద్భుతమైన క్యారెక్టర్ ఉందని, దానిని ఆయన ఓకే చేశాడని కూడా అంటున్నారు.
ఈ మూవీని పీపుల్స్ మీడియా సంస్థ నిర్మించనుంది. ఇందులో హాలీవుడ్ నటుడు, టెక్నీషియన్స్‌ని కూడా తీసుకున్న గ్లోబల్ స్టాండర్డ్స్‌లో దీనిని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. థ్రిల్లర్ జోనర్‌కి చెందిన ఈ చిత్రం గురించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది!