Advertisement
Google Ads BL

వర్మ ఇలా అయిపోయాడేంటి సామి!


వర్మలో సినిమాలు తీసే సత్తా తగ్గిందని వాదించే వారు కూడా ఆయన ఏ చిత్రం తీసినా, ఎంత చిన్నచిత్రమైనా, చివరకు 'గాడ్స్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌'వంటి వాటినైనా కూడా ప్రమోషన్‌ ఎలా చేయాలి? అందరి దృష్టిని ఎలా ఆకర్షించాలి? తన చిత్రం పది మంది నోళ్లలో ఎలా నానాలి? తన సినిమా బిజినెస్‌ ఎలా జరిపించుకోవాలి? అనే ఎత్తుగడలలో మాత్రం ఆయన్ను మించిన వారు లేరనే చెప్పాలి. ఈ బిజినెస్‌ టెక్నిక్‌ వర్మకి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదనే అంటారు. అలాంటిది వర్మ 'శివ' విడుదలైన 28 ఏళ్ల తర్వాత అందునా తన సొంత బేనర్‌లో టాలీవుడ్‌లో చాలా కాలం తర్వాత స్టార్‌ హీరో అయిన నాగార్జునను మెప్పించి 'ఆఫీసర్‌' చిత్రం స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. 

Advertisement
CJ Advs

ఆయన కంపెనీలోనే ఈ చిత్రం కూడా రూపొందుతూ ఉండటంతో ఆయన విడుదల నాటికి ఆ చిత్రానికి హైప్‌ తెచ్చేలా గిమ్మిక్కులు చేస్తారని, వర్మని చిన్నగా అంచనా వేయలేమని పలువురు భావించారు. కానీ ఏమైందో ఏమో గానీ 'ఆఫీసర్‌' చిత్రాన్ని 25 వ తేదీ నుంచి జూన్‌1కి వాయిదా వేశారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి పెద్దగా బిజినెస్‌ కూడా జరగలేదని తెలుస్తోంది. ఏదో నాగ్‌ భరోసాపై కామాక్షి ఫిల్మ్స్‌తో పాటు నాగార్జున, వర్మలే చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇక ఈచిత్రం నుంచి రెండు టీజర్లు, ఒక ట్రైలర్‌ వచ్చినా కూడా చప్పగా ఉన్నాయి గానీ వర్మ మార్కులా లేవు. 

ఇక ఎట్టలకేలకు వర్మ స్పందించాడు. ఈనెల 28వ తేదీన సాయంత్రం 7గంటలకు ఎన్‌కన్వెక్షన్‌ సెంటరలో ఈ చిత్రం ప్రీరిలీజ్‌ వేడుక జరగనుందని, దీనికి నాగార్జున అభిమానులందరికీ ఆహ్వానం పలుకుతున్నామని ఆయన ప్రకటించాడు. మరి ఈచిత్రంకి పోటీగా మంచి చిత్రాలు విడుదల అవుతున్నాయి. మరి ఈ పోటీలో వర్మ ఈ చిత్రాన్ని ఎలా బయటపడేలా చేస్తాడో వేచిచూడాల్సివుంది..! 

No Business to Varma Officer Movie:

RGV Welcomes Nag Fans for Officer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs