Advertisement
Google Ads BL

అను పని అయిపోయినట్లేనా!


'మజ్ను' చిత్రంతోనే యువతను ఆకట్టుకున్న అనుఇమ్మాన్యుయేల్‌ ఆ వెంటనే పవన్‌కళ్యాణ్‌-త్రివిక్రమ్‌ల 'అజ్ఞాతవాసి'లో సెకండ్‌ హీరోయిన్‌గా, అల్లుఅర్జున్‌ నటించిన 'నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా'లో మెయిన్‌ హీరోయిన్‌గా నటించింది. కానీ ఈ రెండు చిత్రాలతో అదృష్టవంతురాలు అనుకున్న ఆమె ఆయా చిత్రాల ఫలితాలతో మాత్రం డిజప్పాయింట్‌ అయింది. మరోవైపు బన్నీ 'నాపేరు సూర్య' ప్రమోషన్స్‌ కోసం చెమటలు కక్కితే ఈమె మాత్రం అసలు ప్రమోషన్స్‌ విషయాన్నే పట్టించుకోలేదు. 

Advertisement
CJ Advs

దాంతో ఈమె తీరు పట్ల గీతాఆర్ట్స్‌ కాస్త గుస్సా అయిందని వార్తలు వచ్చాయి. అయినా అవి నిజం కాదని తేలిపోయింది. ఈమె ప్రస్తుతం 'శైలజారెడ్డి అల్లుడు'తో బిజీగా ఉండి శ్రీనువైట్ల, రవితేజల 'అమర్‌ అక్బర్‌ ఆంథోని' చిత్రాన్ని కూడా వదులుకుంది. ఇలాంటి సమయంలో ఈమె గీతాఆర్ట్స్‌ బేనర్‌లో విజయ్‌దేవరకొండ హీరోగా పరుశురాం దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో 10 నిమిషాల నిడిమి ఉండే కీలక అతిధి పాత్రను గీతాఆర్ట్స్‌ ఆఫర్‌ చేయడం, ఆమె ఓకే చెప్పడం జరిగాయి. 

దీంతో ఈ భామ రవితేజ సినిమాని కూడా వదులుకుని గీతాఆర్ట్స్‌ చిత్రంలో గెస్ట్‌ రోల్‌ ఒప్పుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఈమెకి గీతాఆర్ట్స్‌ సపోర్ట్‌ బాగా ఉందనే టాక్‌ వినిపిస్తోంది. 

Anu Emmanuel Turns Guest for Vijay Devarakonda:

Anu Emmanuel Guest Role in Taxiwala
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs