ప్రస్తుతం దేశం అంతా 'హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్' చాలెంజ్‌లో మునిగి తేలుతున్నారు. దీనిని ప్రారంభించిన ఒలింపిక్ పతకం విజేత, కేంద్రమంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాధోడ్ తాను పుషప్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసి 'హృతిక్‌రోషన్, సైనానెహ్వాల్, విరాట్‌కోహ్లి'లకు చాలెంజ్ విసిరాడు. సైనా ఫిట్‌నెస్ చేస్తున్న వీడియోను షేర్ చేస్తూ రానా దగ్గుబాటి, పివి సింధు, గౌతమ్‌గంబీర్‌లను నామినేట్ చేసింది.
సింధు ఫిట్నెస్ చాలెంజ్‌లో పాల్గొని అక్కినేని అఖిల్‌కి చాలెంజ్ విసిరింది. అఖిల్ సింధు చాలెంజ్‌ని స్వీకరించి జిమ్‌లో చేస్తున్న కసరత్తుల ఫొటోలను పోస్ట్ చేసి తన తండ్రి నాగార్జున, సోదరుడు నాగచైతన్య, వరుణ్‌ధావన్‌లతో పాటు 'మహానటి'లో జెమిని గణేషన్‌గా నటించి మెప్పించిన మాలీవుడ్ సూపర్‌స్టార్ మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్‌లకి చాలెంజ్ విసిరాడు. మరి ఈ నలుగురిలో ఎవరు ముందుగా అఖిల్ చాలెంజ్‌ని స్వీకరిస్తారో చూడాలి.
ఇక దేశంలోని ప్రతి ఒక్కరు ఫిట్‌గా ఉండాలనేది ప్రధాని మోదీ ఆకాంక్ష అని అందుకే తాను ఈ చాలెంజ్‌ని ప్రారంభించానని రాజ్యవర్ధన్‌సింగ్ రాధోడ్ తెలిపాడు. ఇక విరాట్‌కోహ్లి చాలెంజ్‌ని మోదీ కూడా తాను స్వీకరిస్తునానని, త్వరలో తాను చేస్తున్న కసరుత్తుల వీడియోను పోస్ట్ చేస్తానని తెలపడం విశేషం.