Advertisement
Google Ads BL

రీమేక్‌ కాదు.. ఫ్రీమేక్‌ కాదు.. సొంత కథ!


ఈమధ్య ఏ కొత్త చిత్రం మొదలైనా, టైటిల్‌, టీజర్‌, పోస్టర్స్‌, ట్రైలర్స్‌ ఇలా ఏవి విడుదలైనా కూడా ఈ చిత్రాలు ఫలానా హాలీవుడ్‌ చిత్రానికో, లేదా విదేశీ చిత్రానికో, బాలీవుడ్‌ చిత్రానికో ఫ్రీమేక్‌ అనే వార్తలు విపరీతంగా వినిపిస్తున్నాయి. ఇందులో కొన్ని నిజమేనని నిరూపిస్తుంటే కొన్ని మాత్రం తప్పుగా తేలుతున్నాయి. ఇక 'ఊపిరి' చిత్రంలో కార్తితో కలిసి నటించిన నాగార్జున ప్రస్తుతం నేచురల్‌ స్టార్‌ నానితో కలిసి ఓ మల్టీస్టారర్‌ చిత్రం చేస్తున్నాడు. 'మహానటి'తో ఊపుమీదున్న అశ్వనీదత్‌ వైజయంతీ మూవీస్‌ పతాకంపై రూపొందుతున్న ఈచిత్రానికి 'భలే మంచిరోజు, శమంతకణి' చిత్రాల దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు. 

Advertisement
CJ Advs

కాగా ఈ చిత్రం ఓ హాలీవుడ్‌ మూవీకి ఫ్రీమేక్‌ అని, కాదు. కాదు.. 2007లో వచ్చిన 'జానీగద్దర్‌'కి ఫ్రీమేక్‌ అని వార్తలు వస్తున్నాయి. కానీ యూనిట్‌ మౌనంగా ఉండటంతో ఇవ్వన్నీ నిజమేనేమో అనే వార్తలు బలపడ్డాయి. కానీ తాజాగా ఈ చిత్రం విషయంలో దర్శకుడు శ్రీరాం ఆదిత్య స్పందించాడు. ఈ చిత్రం ఏ చిత్రానికి కాపీకాదని, ఇది తాను సొంతగా తయారుచేసుకున్న కథ అని క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈచిత్రం షూటింగ్‌ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. 

ఈ చిత్రంలో నాగార్జున డాన్‌ పాత్రను పోషిస్తుండగా, నాని డాక్టర్‌ పాత్రను చేస్తున్నాడు. నాగార్జున సరసన సుమంత్‌ 'మళ్లీరావా' హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్‌ నటిస్తుండగా, నాని సరసన 'ఛలో' బ్యూటీ, కన్నడ 'కిర్రాక్‌ పార్టీ' భామ రష్మిక మండన్న నటిస్తోంది. సీనియర్‌ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వినాయకచవితి కానుకగా సెప్టెంబర్‌ 12న విడుదల చేయాలని భావిస్తున్నారు. 

Nag and Nani Film in Not Remake:

Director Sriram Aditya Clarity on Nag and Nani Story 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs