Advertisement
Google Ads BL

పవన్‌ డైరెక్టర్‌తో... పవన్‌ భక్తుడు!


త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నితిన్‌ నటించిన 'అ..ఆ' చిత్రం 50కోట్ల క్లబ్‌లో చేరింది. అయినా ఈ చిత్రం హిట్‌ క్రెడిట్‌ త్రివిక్రమ్‌, సమంతల ఖాతాలోకి వెళ్లిపోయాయి. ఆ తర్వాత నితిన్‌ చేసిన 'లై, ఛల్‌మోహన్‌రంగ' చిత్రాలు సరిగా ఆడలేదు. దీంతో ప్రస్తుతం పవన్‌ భక్తుడి పరిస్థితి త్రిశంసుస్వర్గంలా ఉంది. నితిన్‌కి ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఓ హిట్‌ ఖచ్చితంగా కావాలి. 'లై' చిత్రం డిఫరెంట్‌ చిత్రంగా, భారీ బడ్జెట్‌తో హనురాఘవపూడితో చేసినా, 'ఛల్‌మోహన్‌రంగ' చిత్రాన్ని స్వయంగా పవన్‌, త్రివిక్రమ్‌, నితిన్‌ శ్రేష్ట్‌ మూవీసే నిర్మించినా కూడా అది కూడా నితిన్‌కి హిట్‌ అందించలేక పోయింది. 

Advertisement
CJ Advs

ఇక ప్రస్తుతం దిల్‌రాజు నితిన్‌తో తన 'దిల్‌' తర్వాత ఇంత గ్యాప్‌లో 'శ్రీనివాసకళ్యాణం' చిత్రం చేస్తున్నాడు. 'శతమానం భవతి' వంటి అవార్డు, రివార్డులను గెలుపొందిన చిత్రం తీసిన దర్శకుడు సతీష్‌వేగ్నేష్‌ దీనికి దర్శకత్వం వహిస్తుండగా, 'తొలిప్రేమ'తో ఆకట్టుకున్న రాశిఖన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక నితిన్‌ తదుపరి చిత్రం కూడా దాదాపు ఖరారైపోయిందని అంటున్నారు. 'కొంచెం ఇష్టం..కొంచెం కష్టం' వంటి క్లాస్‌ ఫిల్మ్‌తో తెరంగేట్రం చేసిన దర్శకుడు కిషోర్‌ పార్థసాని అలియాస్‌ డాలీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. డాలీ తన మొదటి చిత్రం తర్వాత వరుసగా 'తడాఖా, గోపాల గోపాల, కాటమరాయుడు' వంటి రీమేక్స్‌ చేశాడు. 

ఇక 'కాటమరాయుడు' చిత్రం నిరాశపరచడంతో ఆ తర్వాత ఈయనకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక నితిన్‌తో డాలీ చేయబోయే చిత్రంలో హీరో క్యారెక్టర్‌ విభిన్నంగా ఉండటంతో ఈ చిత్రాన్ని కూడా నితిన్‌ తమ సొంత బేనర్‌లోనే నిర్మించనున్నాడు. మరి ఇది పవన్‌ రికమండేషన్‌ వల్ల వచ్చిందా? అనే చర్చ టాలీవుడ్‌లో సాగుతోంది. 

Nithin Movie in Dolly Direction:

Gopala Gopala Movie Director Directs Nithin
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs