Advertisement
Google Ads BL

అమితాబ్‌ కి, షారుక్ కి ఉన్న బంధమేంటి?


బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌, రజనీకాంత్‌ వంటి వారు అరుదుగా ఉంటారు. వీరు స్నేహానికి, విలువలకు, ప్రేమాభిమానాలకు ఎక్కువగా విలువనిస్తారు. అదే సమయంలో తేడా వస్తే నో చెబుతారు. ఇక బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌ విషయానికి వస్తే ఆయన మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న 'సై..రా..నరసింహారెడ్డి' చిత్రంలో కీలక పాత్రను చేస్తున్నాడు. ఇక అక్కినేని ఫ్యామిలీ చిత్రమైన 'మనం'లో నటించాడు. ఈరెండు చిత్రాలకు ఆయన పారితోషికం తీసుకోవడం లేదని సమాచారం. అదే సమయంలో బాలకృష్ణ -కృష్ణవంశీల 'రైతు' చిత్రంలో చేయమంటే చేయనని చెప్పాడు. ఇక తాజాగా అమితాబ్‌కి సంబంధించిన మరోగొప్ప విషయం బయటకి వచ్చింది. బిగ్‌బి ఫ్యామిలీతో షారుఖ్‌ఖాన్‌కి మంచి అనుబంధం ఉంది. దాంతో షారుక్‌ఖాన్‌ 13ఏళ్ల కిందట తనసొంత నిర్మాణ సంస్థ రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మించిన 'పహేలి' చిత్రంలో అమితాబ్‌ గెస్ట్‌ పాత్రను చేశాడు. 

Advertisement
CJ Advs

ఆచిత్రం షూటింగ్‌ పూర్తయిన తర్వాత షారుఖ్‌ఖాన్‌ అమతాబ్‌కి కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ఉత్తరం రాసి, దానితో పాటు కోటి రూపాయల పారితోషికం చెక్‌ని కూడా పంపాడట. కానీ ఆ చెక్‌ని అందుకున్న అమితాబ్‌ దానిని తిరిగి షారుఖ్‌కి పంపించి వేశాడట. దాంతో షారుఖ్‌ చెక్‌ని ఎందుకు తిరిగి పంపారు? అని ప్రశ్నిస్తే నీతో కలిసి చేసిన ఏ చిత్రానికైనా నేను పారితోషికం తీసుకోను. అది నా నియమం అని చెప్పడంతో అంతులేని ఆనందం వేసిందని, కేవలం అభిమానంతో కోటిరూపాయలను కూడా కాదనుకున్న బిగ్‌బి ఇచ్చిన ఆ సమాధానం మరువలేనని షారుఖ్‌ చెప్పుకొచ్చాడు.

ఈ విషయంపై కొందరు అమితాబ్‌ని పొడుగుతుండగా, మరికొందరు మాత్రం షారుఖ్‌ ఏమీ ఊరకే ఇవ్వలేదు కదా..ఆయనిచ్చిన కోటి రూపాయలను తీసుకుని ఏదో ఒక మంచి పనికి వాడి ఉంటే బాగుండేదని కామెంట్‌ చేస్తున్నారు. ఇక పారితోషికం తీసుకోకపోయిన కూడా అమితాబ్‌ ఉదయం 7గంటలకు షూటింగ్‌ అంటే 6గంటలకే మేకప్‌తో సెట్‌లో రెడీగా ఉండేవాడని షారుఖ్‌ చెప్పుకొచ్చాడు. 

Big B Returns 1 Crore Cheque to Shahrukh:

Bonding Between Big B and Shahrukh Revealed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs