Advertisement
Google Ads BL

అయ్య బాబోయ్.. ఇలియానాకి అంతా?


సన్నజాజి లాంటి నడుమందాలతో ఇలియానా ఒకప్పుడు టాలీవుడ్ ని ఒక ఊపు ఊపింది. మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలందరి సరసన నటించిన ఇలియానాకి బాలీవుడ్ మీద మోజు పుట్టి టాలీవుడ్ ని కాలదన్నింది. బాలీవుడ్ కి వెళ్లినా అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో నటించిన ఇలియానా గత కొంతకాలంగా తెలుగు తెరకు పూర్తిగా దూరమైంది. అయితే తాజాగా ఇలియానా శ్రీను వైట్ల - రవితేజ 'అమర్ - అక్బర్ - ఆంటోని' సినిమాలో నటిస్తుందని న్యూస్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Advertisement
CJ Advs

అయితే శ్రీను వైట్ల అండ్ కో ఇలియానాని సంప్రదించడం నిజమే అని... 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరిగా ఇలియానాని సెలెక్ట్ చేసినట్లుగా  తెలుస్తోంది. అయితే ఇలియానాని రవితేజ - శ్రీను వైట్ల సినిమాలోకి హీరోయిన్ గా అప్రోచ్ కాగా దీనికి ఇలియానా ఒప్పుకోవడానికి ముందుగా రెండు కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇలియానా కోసం ఆమె నడుమందాలు కోసం 'అమర అక్బర్ ఆంటోని' నిర్మాతలు ఆమెకి రెండు కోట్లు పారితోషకం ఇవ్వడానికి అంగీకరించినట్లుగా తెలుస్తోంది.

మరి తెలుగులో ఇలియానాని పట్టించుకునే నాధుడే లేనప్పుడు.. ఇంత పారితోషకం డిమాండ్ చెయ్యడం ఆశ్చర్యకర విషయమే. అయినా ఇలియానా అంత డిమాండ్ చేసినా.. దానికి నిర్మాతలు తలూపడమే ఇప్పుడు అర్ధం కాని విషయం. ఏదైనా ఇలియానాకి టాలీవుడ్ లో పెద్దగా క్రేజ్ లేదు. అలాంటప్పుడు ఆమె మీద రెండు కోట్లు పొయ్యడం మాత్రం కరెక్ట్ కాదనే అభిప్రాయాలూ వినబడుతున్నాయి.

Ileana Remuneration for AAA:

Ileana Demands 2 Crores for Raviteja Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs