Advertisement
Google Ads BL

'సైరా' కు అనుగుణంగా చరణ్ ప్లాన్స్!


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండు బాధ్యతలు తన భుజంపై వేసుకుని ముందుకు వెళ్తున్నాడు. ఒక పక్క భారీ సినిమాల్లో హీరోగా నటిస్తుండగా మరోపక్క అంత‌కుమించిన భారీ సినిమాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అతను బోయపాటి డైరెక్షన్ లో ఓ భారీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దానితో పాటు తన తండ్రి చిరంజీవి క‌థానాయ‌కుడిగా దాదాపు 200కోట్ల బ‌డ్జెట్‌తో 'సైరా-న‌ర‌సింహారెడ్డి' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Advertisement
CJ Advs

ఈ రెండు ప్రాజెక్ట్స్ చరణ్ పై తీవ్ర‌మైన ఒత్తిడి నెల‌కొంద‌ని తెలుస్తోంది. ఈ రెండు ప్రాజెక్ట్స్ చరణ్ కు ఎంతో కీలకమైనవి. ఈ రెండిటి విజ‌యం ఎంతో ఇంపార్టెంట్‌. ఆ క్ర‌మంలోనే రిలీజ్ తేదీల క్లాషెస్ ఊహించ‌ని రీతిలో చ‌ర‌ణ్‌పై ఒత్తిడి పెంచుతోందిట‌. ఇప్పటి వరకు ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ పై చరణ్ కు ఇంకా క్లారిటీ లేదు. మొదట 'సైరా' రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాకే తర్వాత తన సినిమా గురించి ఆలోచించమని డి.వి.వి.దాన‌య్య‌ను చ‌ర‌ణ్ అభ్య‌ర్థించాడ‌ట‌.

'సైరా' సంక్రాంతికి వస్తే చరణ్ తన సినిమాను సంక్రాంతి తర్వాత వేసుకుంటాడు. అదే 'సైరా' సమ్మర్ కి వెళ్తే బోయపాటి సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాల‌న్న ఆలోచ‌న చ‌ర‌ణ్‌ చేశార‌ట‌. అవి ఏవి కుదరకపోతే బోయపాటి - చరణ్ సినిమా ఈ ఏడాది అక్టోబ‌ర్‌లోనే రిలీజ్ చేస్తాం అంటున్నారు. అయితే దీనిపై అధికారికంగా నిర్మాత‌లు ప్ర‌క‌టించాల్సి ఉంది.

Release Clashes Between Charan and Chiru Film:

Sye Raa and Charan Movies Release Dates Clashes
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs