'మహానటి' ది తిరుగులేని విజయం!


'మహానటి' సినిమా రిలీజ్ అవ్వకముందు మహా అయితే ఈ సినిమా ఓవరాల్ గా 20 కోట్లు వసూల్ చేస్తుంది అని అనుకున్నారు అంత. ఒకవేళ ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చిన వసూల్ ఏమి అంత గొప్పగా ఉండవని అంచనా వేశారు అంత. కానీ అందరి అంచనాలు తప్పని రుజువు చేసింది ‘మహానటి’.

సినిమాకు అద్భుతమైన టాక్ రావడంతో జనాలు ఎగబడి థియేటర్స్ కి వెళ్ళుతున్నారు. తొలిరోజు ఈవినింగ్ షోస్ నుండి థియేటర్స్ అన్ని ఫుల్ అవుతున్నాయి. వీక్ డేస్.. వీకెండ్స్ అని తేడా లేకుండా ఈ సినిమా వసూళ్లతో సాగుతోంది. రెండో వీకెండ్ కూడా ఈ చిత్రం మంచి వసూళ్లతో సాగుతుండటం విశేషం. ఈ సోమవారం నాటికి రూ.30 కోట్ల మైలురాయిని కూడా టచ్ చేసింది.

నైజాంలో రూ.8 కోట్లకు పైగా ఈ చిత్రం షేర్ సాధించడం విశేషం. అలానే ఉత్తరాంధ్రలో రూ.2.25 కోట్లు.. సీడెడ్లో రూ.1.7 కోట్లు.. మిగతా ఏరియాల్లో కలిపి రూ.5 కోట్లకు పైగా షేర్ సాధించింది. తమిళంలో రూ.2 కోట్ల దాకా షేర్ వచ్చినట్లు సమాచారం. 

అటు ఓవర్సీస్ లో కూడా ఇదే జోరు. అమెరికాలో ఈ చిత్రం 2.5 మిలియన్ డాలర్ల మార్కుకు అత్యంత చేరువగా ఉంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ.20 కోట్లకి అమ్మినట్టు తెలుస్తోంది. కానీ కొన్ని ఏరియాస్ మాత్రం నిర్మాత అశ్వినీదత్ సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. దానివల్ల ఆయనకు మంచి ఫలితమే దక్కింది.

Mahanati Grand Success at Box-Office:

Mahanati Shocks With Big Success
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES