Advertisement
Google Ads BL

'సాక్ష్యం' కి కూడా బాగానే పెట్టేశారు!


బెల్లంకొండ సురేష్ తన కొడుకుని ఎంతో గ్రాండ్ గా 'అల్లుడు శ్రీను' సినిమాతో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను నిర్మాత సురేష్..బయర్స్ కి తక్కువ రేట్ కి అమ్మి వాళ్ళ పరంగా సక్సెస్ అనిపించుకున్నాడు కానీ నిర్మతగా సురేష్ కి నష్టాలు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ 'స్పీడున్నోడు' తో మన ముందుకు ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు వెళ్ళాడో కూడా తెలియని పరిస్థితి.

Advertisement
CJ Advs

బోయపాటి శ్రీను... శ్రీనివాస్ ని హీరోగా పెట్టి 'జయ జానకీ నాయక' సినిమాను తీశాడు. దీని నుంచి మంచి స్పందనే వచ్చినా కానీ భారీ బడ్జెట్‌ వల్ల నష్టాలు తప్పలేదు. అయితే మార్కెట్ పరంగా చూసుకుంటే శ్రీనివాస్ కి 25 కోట్లు లోపే. కానీ 'సాక్ష్యం' చిత్రానికి బడ్జెట్‌ ముప్పయ్‌ అయిదు కోట్లు పైమాటే అంటున్నారు. అటు దర్శకుడు శ్రీవాస్ కి కూడా మార్కెట్ అంతగా లేదు. మరి ఏ ధైర్యంతో ఈ సినిమాపై ఇంత ఖర్చు పెట్టారనేది నిర్మాతలకే తెలియాలి.

అయితే ఈ సినిమాను నిర్మిస్తున్న అభిషేక్‌ పిక్చర్స్‌ వారికి బ్యాకెండ్‌లో బెల్లంకొండ సురేష్‌ ఫండింగ్‌ వుందనే పుకార్లున్నాయి. అంత ఫండింగ్ ఉన్న అతని మార్కెట్ 25 కోట్లు అయితే సినిమా తీయడానికే 35 కోట్లు ఖర్చు పెట్టారంటే దానికి తగ్గ వసూల్ చేయాలంటే అంత సాధ్యమైన పని కాదు. ఈసారి అయినా తనపై పెడుతోన్న పెట్టుబడికి తగ్గ విజయాన్ని సాధిస్తాడా అనేది చూడాలి.

Heavy Budget to Sai Srinivas Sakshyam Film:

Bellamkonda Sai Srinivas Sakshyam Budget Revealed 35 Crores  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs