Advertisement
Google Ads BL

అర్జున్‌రెడ్ది బాలీవుడ్ కి హీరోయిన్ ఫిక్స్‌!


'అర్జున్‌రెడ్డి' చిత్రం టాలీవుడ్‌లో ఓ సైలెంట్‌ కిల్లర్‌గా వచ్చి రచ్చ చేసింది. అసలు ఈ చిత్రం వచ్చే దాకా ఇంత బోల్ద్‌గా, రొమాన్స్‌, యాక్షన్‌, ఇతర సన్నివేశాలలో ఇంత 'రా' మెటీరియల్‌తో ఓ చిత్రం వస్తుందని, వచ్చి అంతలా ప్రేక్షకులను అలరిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ దానిని నిజం చేసిన 'అర్జున్‌రెడ్డి' తెలుగులో ఇంటెన్స్‌ స్టోరీలకు శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ఈచిత్రం కోలీవుడ్‌, బాలీవుడ్‌లలో రీమేక్‌ అవుతుంది. సహజంగా ఇలాంటి చిత్రాలతోనే ఎంతో పేరు తెచ్చుకున్న తమిళ దర్శకుడు బాలనే ఈ చిత్రాన్ని హీరో విక్రమ్‌ కుమారుడు దృవ్‌ని హీరోగా పరిచయం చేస్తూ రీమేక్‌ చేస్తున్నాడంటే ఈ చిత్రం అందరినీ ఏ స్థాయిలో అలరించిందో అర్ధం చేసుకోవచ్చు. తమిళంలో 'వర్మ' అనే టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రంలోని హీరోయిన్‌ని ఇంకా ఫిక్స్‌ చేయలేదు. మొదటి షెడ్యూల్‌ పూర్తి అయినా కూడా హీరోయిన్‌ కోసం వేటసాగిస్తున్నారు. 

Advertisement
CJ Advs

ఇక ఈ చిత్రం బాలీవుడ్‌లో తెలుగు ఒరిజినల్‌ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలోనే రూపొందుతుండటం విశేషం. బాలీవుడ్‌ మార్కెట్‌ దృష్ట్యా బడ్జెట్‌ నియంత్రణ, మరోవైపు కాస్త డోస్‌ పెంచి చూపడం బాలీవుడ్‌లో కామన్‌ కావడం, దానికి సెన్సార్‌ పరిమితులు కూడా బాగానే ఉండటంతో దీనిని మరింత బోల్డ్‌గా తీయడానికి, సన్నివేశాలలో మరింత మసాలా జోడించేందుకు, హీరో హీరోయిన్ల నేపధ్యాన్ని, కథను కూడా బాలీవుడ్‌ నేటివిటీకి తగినట్లుగా తీయడానికి సందీప్‌రెడ్డి వంగా సంసిద్దుడు అవుతున్నాడు. మొదట్లో ఈ చిత్రంలో అర్జున్‌కపూర్‌, వరుణ్‌ధావన్‌ల పేర్లు వినిపించినప్పటికీ చివరకు ఇందులో హీరో పాత్రకు షాహిద్‌ కపూర్‌ ఓకే అయ్యాడు. ఆయన గతంలో 'ఉడ్తా పంజాబ్‌'లో కూడా కాస్త ఇలాగే ఉండే డ్రగ్‌ ఎడిక్ట్‌ పాత్రను అద్భుతంగా పోషించాడు. 

ఇందులో షాలిని పాండే పోషించిన హీరోయిన్‌ పాత్రకు తారా సుతారియాను ఎంపిక చేశారు. టివి ద్వారా పాపులర్‌ అయిన ఆమె ఇప్పటికే కరణ్‌జోహార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'స్టూడెంట్‌ ఆఫ్‌ది ఇయర్‌ 2'లో టైగర్‌ష్రాఫ్‌ సరసన నటిస్తోంది. మరి షాలిని పాండే పాత్రలో తారా సుతారియా ఏ స్థాయిలో అదరగొడుతుందో వేచిచూడాల్సివుంది...! 

Tara Sutaria in Arjun Reddy Bollywood Remake:

Arjun Reddy Bollywood Remake Heroine Fixed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs