Advertisement
Google Ads BL

సవ్యసాచికి మాధవనే హైలెట్ అంట!


తన కెరీర్‌లో ఎన్ని చిత్రాలలో నటించామనేది ముఖ్యం కాదు. ఎన్ని మంచి చిత్రాలలో, ఎంత వైవిధ్యభరితమైన పాత్రలు చేశామనేదే ముఖ్యమని ఆలోచించే వారిలో ఇద్దరు తమిళ నటులను ముఖ్యంగా చెప్పుకోవాలి. వారే అరవింద్‌స్వామి, మాధవన్‌. ఇక తన కెరీర్‌లో ఏ పాత్రనంటే ఆ పాత్రను ఒప్పుకోని మాధవన్‌ తనకు తెలుగు రాకపోవడంతో ఇప్పటి వరకు తెలుగులో స్ట్రెయిట్‌ చిత్రం చేయలేదు. కానీ ఓ పాత్ర కోసం తన పట్టును కూడా విడిచి ఆయన తెలుగులో ఇంత కాలానికి ఓ పాత్ర చేస్తున్నాడంటే ఏదో విషయం లేనిదే ఆయన చేయడు అని ప్రేక్షకుల నమ్మకం. 

Advertisement
CJ Advs

ఇక గతంలో వచ్చిన 'తని ఒరువన్‌' దాని రీమేక్‌ 'ధృవ' ద్వారా విలన్‌ అంటే ఇంత క్లాస్‌ అండ్‌ కూల్‌గా ఉంటూ, ఇంటెలిజెంట్‌ ప్లే చేసే పాత్రలు కూడా ఉంటాయా? అనిపించాడు అరవింద్‌స్వామి. ఇప్పుడు అదే పనిని 'సవ్యసాచి' ద్వారా మాధవన్‌ చేస్తున్నాడని సమాచారం. చందు మొండేటి దర్శకత్వంలో అపజయమే ఎరుగని ఇండస్ట్రీ హిట్‌ కంటే తక్కువ కాని చిత్రాలను నిర్మిస్తున్న మైత్రి మూవీమేకర్స్‌, దర్శకుడు చందు మొండేటి వారి వల్ల కూడా ఈ ప్రాజెక్ట్‌కి మంచి క్రేజ్‌ వస్తోంది. ఇక ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న మాధవన్‌ ఇంత వరకు చేయని పాత్ర ఇది అని అంటున్నారు. తాను ఎవరనే విషయాన్ని హీరోకి తెలియకుండా కూల్‌గా హీరోని టెన్షన్‌ పెట్టి, పరుగులు తీయించే పాత్రను ఇందులో మాధవన్‌ చేస్తున్నాడట. 

హీరో అక్కగా నటిస్తున్న భూమిక మీద కోపంతో ఆమె కూతురు అయిన నిధి అగర్వాల్‌ని కిడ్నాప్‌ చేసి హీరోతో మైండ్‌ గేమ్‌ ఆడే పాత్రలో మాధవన్‌ కనిపిస్తాడని అంటున్నారు. మొత్తానికి రాబోయే చిత్రాలలో వైవిధ్యభరితమైన చిత్రాలను కోరుకునే ప్రేక్షకుల చూపంతా 'సవ్యసాచి'పైనే ఉందని చెప్పాలి. 

Madhavan Villain Role in Savyasachi:

Madhavan Role Revealed in Savyasachi Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs