Advertisement
Google Ads BL

'ఇడియట్' భామ ఇకపై వినిపిస్తుంది!


ఒకప్పుడు పూరీజగన్నాథ్‌ పరిచయం చేసే హీరోయిన్లకు ఎంతో క్రేజ్‌ ఉండేది. ఆయన చిత్రాలు తీసిన హీరోలతోపాటు హీరోయిన్లు కూడా ఓ వెలుగు వెలిగేవారు. ఆ కోవకి చెందిన వారే రవితేజ, రక్షిత, అసిన్‌ వంటివారు. ఇక రక్షిత విషయానికి వస్తే ఈమె పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో రవితేజ నటించిన సూపర్‌హిట్‌ చిత్రం 'ఇడియట్‌' ద్వారా తెలుగు తెరకి పరిచయమైంది. ఆతర్వాత వరుసగా 'పెళ్లాం ఊరెళితే, నిజం, శివమణి, ఆంధ్రావాలా, అందరివాడు' వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఈమె ప్రేమ్‌ అనే దర్శకుడిని వివాహం చేసుకుని సెటిల్‌ అయింది. ప్రస్తుతం ఆమె భర్త ప్రేమ్‌ కన్నడలో శివరాజ్‌కుమార్‌, సుదీప్‌, శ్రీకాంత్‌, అమీజాక్సన్‌ వంటి భారీ తారాగణంతో 'విలన్‌' అనే చిత్రం తీస్తున్నాడు. 

Advertisement
CJ Advs

ఈ చిత్రం కోసం ప్రేమ్‌ భార్య రక్షిత పనిచేసింది. అది తెరపై కాదు.. తెరవెనుక. విషయం ఏమిటంటే ఈ చిత్రంలో రక్షిత అమీజాక్సన్‌ పాత్రకు డబ్బింగ్‌ చెప్పింది. తన భర్తతో కలిసి పనిచేయడం గురించి ఆమె మాట్లాడుతూ, ప్రేమ్‌ పూర్తిగా టాస్క్‌మాస్టర్‌. ఒక్కో డైలాగ్‌ను 20సార్లు కూడా చెప్పించిన సంఘటనలు ఉన్నాయి. ఆయన అనుకున్నట్లు అన్నీ జరగాలి. ఏమాత్రం రాజీపడరు. డైలాగ్‌ని కట్‌ చేసి చెప్పడానికి కూడా ఒప్పుకోలేదు. పెద్ద పెద్ద డైలాగ్స్‌ని ఎన్నోసార్లు చెప్పిస్తారు. ప్రేమ్‌ ఆర్టిస్టుల దగ్గర ఎక్కువగా డబ్బింగ్‌కి సమయం కేటాయిస్తూ ఉంటారు. 

సన్నివేశానికి తగ్గట్లు స్వరాన్ని పలికిస్తూ ఉంటారు. నా గొంతు విభిన్నంగా ఉందని ఈ సినిమాకి తీసుకున్నారు. ఇంత వరకు నా పాత్రలకు నేను డబ్బింగ్‌ చెప్పడం అలవాటు. కానీ వేరే వారి పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం కొత్త అనుభూతిని కలిగించింది. ఈ వర్క్‌ని ఎంతో ఎంజాయ్‌ చేశాను అని చెప్పుకొచ్చింది 'ఇడియట్‌' భామ....! 

Rakshitha Dubbing for Amy Jackson:

Idiot Fame Rakshitha Dubbing to Villain Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs