Advertisement
Google Ads BL

హాట్ హాట్ సినిమాలో అంజలి!


తెలుగమ్మాయే అయినప్పటికీ తమిళ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న నటి అంజలి. ఇక ఈమె నిన్నటి వరకు కాస్త బొద్దుగా ఉండేది. దాంతో ఆమెకి తమిళంలో యువ హీరోల సరసన చాన్స్‌లు వస్తున్నా, తెలుగులో మాత్రం వెంకటేష్‌ వంటి సీనియర్లతో సర్దుకుపోయింది. ఇక ఈమెకి తెలుగుతో పాటు తమిళంపై కూడా పట్టుఉండటం, రెండు భాషల్లో గుర్తింపు ఉండటం ప్లస్‌ పాయింట్స్‌గా మారుతున్నాయి. దాంతో ఆమెతో చిత్రం తీస్తే రెండు భాషల్లోనూ క్రేజ్‌ ఖాయమని అంటారు. ఇక వీటికి తోడు తాజాగా ఆమె హిందీపై కూడా కన్నేసింది. 

Advertisement
CJ Advs

ఇక ఈ అమ్మడు తాజాగా బాగా బరువు తగ్గి నాజూక్కుగా మారింది. గతంలో ఈమె నటించిన హర్రర్‌ చిత్రమైన 'గీతాంజలి' హిట్‌ కాగా, 'చిత్రాంగధ' నిరాశ పరిచింది. దాంతో పాత పాడు పడ్డ బంగ్లాలు, అందులో దెయ్యాలు, రివేంజ్‌లు వంటివి కాకుండా సరికొత్త హర్రర్‌ కాన్సెప్ట్‌ని కథాంశంగా తీసుకుని 'లీసా' అనే చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతుంది. ఇక దీనిని హిందీలో డబ్‌ చేయాలని భావిస్తున్నారు. హర్రర్‌ చిత్రాలలో కూడా డిఫరెంట్‌ కాన్సెప్ట్స్‌ను తీసుకుంటే ఇప్పటికీ అది విజయవంతమైన ఫార్ములానే అని ఇటీవల వచ్చిన సిద్దార్ద్‌ చిత్రం 'గృహం' నిరూపించింది. ఇక ఈ అంజలి హర్రర్‌ చిత్రానికి 'లీసా' అనే టైటిల్‌ని కన్‌ఫర్మ్‌ చేశారు. ఇది త్రీడీ హర్రర్‌ మూవీగా రూపొందుతుండటం, ఇందులో అంజలి ఎంతో స్లిమ్‌గా, గతంలో కనిపించినట్లు బొద్దుగా, అమాయకంగా ఉండే పాత్రను కాకుండా డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ పాత్రగా, గ్లామర్‌షో కూడా ఉండేలా ఉంటుందని యూనిట్‌ చెబుతోంది. 

ఇక ఈ చిత్రాన్ని తమిళ సీనియర్‌ సినిమాటోగ్రాఫర్‌ ముత్తయ్య నిర్మిస్తుండగా, రాజు విశ్వనాథ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. రాజువిశ్వనాథ్‌కి కూడా తెలుగు, తమిళం రెండింటిపై పట్టుంది. ఆయన గతంలో విక్రమ్‌ కె.కుమార్‌తో పాటు పలు దర్శకుల చిత్రాలకు రచనా సహకారం కూడా అందించారు. మరి సరికొత్త యాంగిల్‌లో, అంజలిలో గ్లామర్‌ కోణం ఉండటం, త్రీడీ హర్రర్‌ మూవీ కావడంతో నాజూకుగా తయారైన భామ తన సత్తా ఏమిటో చూపిస్తుందని అనుకోవచ్చు.

Anjali One More Lady Oriented Film:

Anjali Look From Lisaa Revealed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs