Advertisement
Google Ads BL

ఎన్టీఆర్, చరణ్, మహేష్... బన్నీ ఎక్కడ?


ఈ మధ్యన టాలీవుడ్ లో నయా ట్రెండ్ నడుస్తోంది. మహేష్ బాబు సినిమా ఈవెంట్ కి ఎన్టీఆర్ వెళ్తాడు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి మల్టీస్టారర్ చెయ్యడం. ఒకరి వెడ్డింగ్ యానివెర్సరీకి  మరొకరు హాజరవడం. అంతేనా.. ఒక మహేష్ భార్య నమ్రతతో ఉపాసన ఫ్రెండ్ షిప్ చెయ్యడమేకాదు... చెర్రీ వైఫ్ ఉపాసన ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతితో కూడా ఫ్రెండ్లీగా ఉండడం. అబ్బో గత మూడు నాలుగు నెలలుగా సోషల్ మీడియాలో ఇలాంటి అద్భుతమైన ఫొటోస్ 10 రోజులకొకటి దర్శనమిస్తూనే ఉన్నాయి. రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ ముగ్గురు దిగిన ఫోటో ఎంతగా సెన్సేషన్ క్రియేట్ చేసిందో... ఎన్టీఆర్, చరణ్ మహేష్ ల ఫోటో అంతే సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మహేష్ భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ పార్టీలో మహేష్, చరణ్, ఎన్టీఆర్ లు ఎలా సందడి చేశారో తెలిసిందే.

Advertisement
CJ Advs

తాజాగా ఎన్టీఆర్ పుట్టిన రోజున ఎన్టీఆర్, చరణ్ లు ఎంత ప్రేమగా ఫోటో దిగారో చరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో చూస్తే తెలుస్తోంది. బ్రదర్ హ్యాపీ బర్త్ డే అంటూ చరణ్, ఎన్టీఆర్ ని ఉద్దేశించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపితే... తారక్ హ్యాపీ బర్త్ డే అంటూ విషెస్ తెలిపాడు మహేష్. అయితే విడివిడిగా ఎన్టీఆర్ కి మహేష్, చరణ్ లు విషెస్ చెబితే.... తాజాగా ఇప్పుడు ఎన్టీఆర్ అండ్ చరణ్, మహేష్ లు ఎంతో క్లోజ్ గా వున్న ఫోటో బయటికి వచ్చింది. చరణ్, మహేష్, ఎన్టీఆర్ లు ఎప్పుడు క్లోజ్ గా ఉన్నప్పటికీ... ఈమధ్యన వీరు చేస్తున్న హంగామా మాత్రం అభిమానులను పిచ్చెక్కిస్తున్నాయి. మరి ఈ పై ఫోటో చూస్తుంటే... ఎన్టీఆర్ పుట్టిన రోజుకి ఎన్టీఆర్ ఇచ్చిన పార్టీకి మహేష్, చరణ్ లు హాజరయ్యారేమో. మరి వాళ్ళ రిలేషన్ చూస్తుంటే.. రెండుకళ్ళూ చాలవన్నట్టుగా ఉంది.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే ఎప్పుడు ఈ ముగ్గురేనా... వీరితో బన్నీ కలవాడా అంటున్నారు కొందరు. అల్లు అర్జున్ గాని ఆయన భార్య స్నేహ గాని ఎప్పుడు ఇలా మహేష్ భార్య నమ్రతతో గాని, చెర్రీ భార్య ఉపాసనతో కానీ కలిసింది లేదు. చరణ్, అల్లు అర్జున్ లు ఎంత క్లోజ్ గా వున్నా ఈ రకమైన  క్లోజ్ నెస్ మాత్రం ఎప్పుడూ బయటివాళ్లకు కనబడలేదు. అల్లు అర్జున్ కూడా ఇలా మహేష్, ఎన్టీఆర్ లతో క్లోజ్ గా మూవ్ అయ్యింది లేదు. ఏదో అవార్డు ఫంక్షన్ లో ఎన్టీఆర్ అంటే తనకెంతో ఇష్టమని మాత్రం అందరి ముందు చెప్పాడు కానీ.. అల్లు అర్జున్, చరణ్ లాగా స్టార్ హీరోలతో మాత్రం ఫ్రెండ్లీ గా ఉండడం లేదు. ఇక మహేష్, చరణ్, మహేష్ లు కలిసి ఇంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటే... అల్లు అర్జున్ మాత్రం అలా సైలెంట్ గా తన భార్య స్నేహని తీసుకుని ముంబై లోని రెస్టారెంట్ లో తేలాడు. మరి చరణ్, మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ ఇలా అంతా ఒకే వేదికపై ఎప్పుడు కనబడతారో.. అంటూ అందరి ఫ్యాన్స్ వెయిటింగ్.

NTR, Charan, Mahesh Babu in Party Mood:

Bunny Different Them Other Star Heroes
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs