Advertisement
Google Ads BL

త్రివిక్రమ్ మంచి కసి మీద ఉన్నాడు!


టెంపర్ తర్వాత మళ్ళీ సిక్స్ ప్యాక్ తో 'అరవింద సమేత వీర రాఘవ' అంటున్నాడు ఎన్టీఆర్. త్రివిక్రమ్ తో సినిమా కోసం పరితపించిన ఎన్టీఆర్ కి త్రివిక్రమ్ కూడా ఒక మంచి హిట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఒకవేళ త్రివిక్రమ్ కి ఈ సినిమా కూడా  హిట్ పడకపోతే.. స్టార్ హీరోలంతా మొహం చాటేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో చేసిన అజ్ఞాతవాసి ఫలితంతోనే మహేష్ బాబు ఇప్పటికే త్రివిక్రమ్ కి హ్యాండిచ్చాడనే టాక్ ఉంది. ఇక ఎన్టీఆర్ సినిమా విషయంలోకి కూడా ఏదన్నా తేడా వస్తే ఇక త్రివిక్రమ్ కి చుక్కలే. అందుకే ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా మీద త్రివిక్రమ్ ఆశలు పెట్టుకోవడమే కాదు.. తన మార్క్ డైలాగ్స్ తో కుమ్మెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు.

Advertisement
CJ Advs

అయితే ఫస్ట్ లుక్ లో మాస్ లుక్ లో పరిచయమైన ఎన్టీఆర్ ని చూస్తుంటే సినిమాలో యాక్షన్ డోస్ కాస్త ఎక్కువగా ఉంటుందని అర్ధమవుతుంది. ఆది, సింహాద్రి లాంటి హై వోల్టేజ్ ఉన్న 'అరవింద సమేత' ని ఎన్టీఆర్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. హీరోయిన్ పూజా హెగ్డే బ్యాక్ డ్రాప్ సాధారణంగా చూపిస్తూ హీరోని మాత్రం పవర్ఫుల్ యాక్షన్ లో చూపించబోతున్నారని టాక్. ఇక సీనియర్ నటుడు నాగబాబు ఎన్టీఆర్ నాన్నగా... ఫస్ట్ పది నిమిషాలు కనిపించే ఒక కీలక పాత్ర చెయ్యబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ని సినిమాలోని యాక్షన్ పార్ట్ నుండి వాడారని చెబుతున్నారు. ఆ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఇంటెర్వెల్ బ్యాంగ్ కి ముందుంటుందనేది లేటెస్ట్ టాక్.

ఎన్టీఆర్ తో పాటుగా విలన్ మీద 42 డిగ్రీల వేడి వాతావరణంలో షూట్ చేసిన ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ అంటున్నారు. ఇక పూజా హెగ్డే పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందని చెబుతున్నారు. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఫస్ట్ అంతా అందమైన ప్రేమకథతో నడిపించిన త్రివిక్రమ్ సెకండ్ హాఫ్ లోనే యాక్షన్ అంటూ ఫైటింగ్ ని టచ్ చేశాడని చెబుతున్నారు. మరి అజ్ఞాతవాసి సినిమా ప్లాప్ ఛాయలు ఈ సినిమాపై పడే అవకాశం లేదు. ఎందుకంటే త్రివిక్రమ్ కి ఉన్న క్రేజ్.. అలాగే యంగ్ టైగర్ కున్న క్రేజ్ ముందు అరవింద సమేత మాంచి బిజినెస్ చేస్తుందని... ఇప్పటికే ఓవర్సీస్ హక్కులు రికార్డు ప్రైజ్ కి అమ్ముడయ్యాయనే టాక్ ఉండనే ఉంది.

Trivikram Powerful Story to JR NTR:

Aravinda Sametha High Voltage Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs